Loan Management Tips: మనిషి అవసరానికి డబ్బు చాలా అవసరం. అయితే అందరి వద్ద అనుకున్నంత ఆదాయం ఉండదు. కానీ నేటి కాలంలో ఆదాయానికి మించిన అవసరాలు, ఖర్చులు ఏర్పడుతున్నాయి. దీంతో అదనపు ఆదాయం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ అప్పులు బ్యాంకు లోన్ తీసుకునే అంతవరకు ఉంటున్నాయి. కొందరు ఇంట్లో అవసరాల కోసం అప్పులు చేస్తే.. మరికొందరు జల్సాల కోసం కూడా రుణాలు తీసుకుంటున్నారు. అయితే వీటిని తీర్చే సమయంలో మాత్రం అనేక బాధలు పడుతున్నారు. అయితే ఈ బాధలు రాకుండా ఉండాలంటే ముందే ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్రణాళిక వల్ల ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ఉండడమే కాకుండా.. ఆదాయం కూడా మిగిలి అవకాశం ఉంటుంది. అదేంటంటే?
Also Read: ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
ఒకప్పుడు అప్పు కావాలంటే ఎన్నో రకాల షరతులు విధించి ఎక్కువ వడ్డీ రేటుకి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రుణం తీసుకోవడం చాలా సులభంగా మారింది. అనేక బ్యాంకులు వినియోగదారులను ఆకర్షించుకోవడానికి తక్కువ వడ్డీకే రుణం అందిస్తున్నాయి. అంతేకాకుండా ఒకటికి మించి క్రెడిట్ కార్డులు జారీ చేయడంతో.. వాటిపై రుణాలు తీసుకుంటున్నారు. అయితే అవసరం ఉన్నంతవరకు రుణం తీసుకుంటే పర్వాలేదు.. కానీ కొందరు అనవసరంగా కూడా అప్పులు చేస్తున్నారు. వీటివల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుత కాలంలో ఉద్యోగం కత్తి మీద సాములాగానే ఉంది. కొన్ని రకాల పరిస్థితుల వల్ల ఇది ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో అప్పులు చేసి ఈఎంఐ చెల్లించడం కష్టతరమే అవుతుంది. అయితే కేవలం ఉద్యోగం పై ఆధారపడి మాత్రమే అప్పు చేయడం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే అనుకోని పరిస్థితుల వల్ల ఉద్యోగం లేనట్లయితే సమయానికి ఈఎంఐ కట్టలేక ఆవేదన చెందుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కేవలం అవసరం ఉన్నంతవరకు మాత్రమే అప్పులు చేసి.. ఉద్యోగం లేకపోయినా వాటిని తీర్చడానికి ఇతర ఆదాయం మార్గాలను చూసుకోవాలి.
Also Read: 65 ఏళ్ళ వయసులో చికెన్ పై చేసిన ప్రయోగం.. విజేతను చేసింది.. ప్రపంచ దేశాల్లో హీరోగా నిలబెట్టింది..
కొన్ని లెక్కల ప్రకారం మన దేశంలో 15 కోట్ల మంది బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లు చెబుతున్నాయి. వీరిలో సగం మంది మాత్రమే రెగ్యులర్గా ఈఎంఐ ని పే చేస్తున్నారు. మిగతావారు కష్టతరంగా డబ్బులు చెల్లిస్తున్నారు. మరికొందరు ఈఎంఐలు రెగ్యులర్గా చెల్లించలేక.. వాటికి వాటికి కడుతున్నారు.అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. దురదృష్టవశాత్తు కొన్ని ప్రమాదాల వల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది.ఇలాంటి పరిస్థితుల వల్ల కుటుంబానికి ఈఎంఐ భారత్ మాత్రమే కాకుండా.. ఆర్థిక భారం కూడా పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ముందుగానే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. నెలకు కేవలం 5 నుంచి 600 లోపు చెల్లిస్తే కోటి రూపాయల వరకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల కుటుంబానికి ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. కుటుంబ పెద్ద లేకున్నా ఈ మొత్తం వల్ల ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.