AP Free RTC Guidelines: ఏపీలో( Andhra Pradesh) మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. స్త్రీ శక్తి పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకానికి సంబంధించి ఈరోజు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది? టికెట్ల జారీ ఎలా ఉంటుంది? ఇతర వివరాలతో కూడిన జీవోను ప్రభుత్వం జారీచేసింది. చాలా రకాల ప్రచారాలకు చెక్ చెబుతూ ఈ జీవో ఉంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం కల్పించనుంది ఏపీ ప్రభుత్వం. మార్గదర్శకాల విడుదలతో అన్ని అంశాలపై ఫుల్ క్లారిటీ వచ్చింది.
Also Read: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఆ రూట్లలో ఉండదు!
ఉన్న బస్సులతోనే పథకం..
ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్థానికులైన బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ( transgenders ) ఉచిత ప్రయాణం కల్పించింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇందుకుగాను నిర్దిష్టమైన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సుల్లోనే ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అవసరాన్ని బట్టి కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని చెబుతోంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ సర్వీసులో మాత్రమే అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రీమియర్ సర్వీసులుగా ఉన్న నాన్ స్టాప్, అంతర్రాష్ట్ర సర్వీసులు, ప్యాకేజీ టూర్లలో వెళ్లే బస్సులలో ఉచిత ప్రయాణం ఉండదు. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో కూడా ఈ పథకం వర్తించదు. నిర్దేశిత రూట్లో అర్హులైన మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: ఉచిత బస్సు ప్రయాణం… కూటమి ప్రభుత్వానికి అదే పెద్ద మైనస్ కానుందా?
అన్ని రకాల జాగ్రత్తలతో..
ఇప్పటికే కర్ణాటక తో( Karnataka ) పాటు తమిళనాడులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలవుతోంది. అక్కడ ఎదురైన పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మహిళల భద్రత కోసం మహిళా కండక్టర్లకు బాడీ లైన్ కెమెరాలు, బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్టీసీ బస్టాండ్లలో సదుపాయాలు మెరుగుపరచనున్నట్లు తెలుస్తోంది. ఉచిత ప్రయాణ పథకంతో బస్టాండ్లకు రద్దు పెరిగే అవకాశం ఉంది. అందుకే అక్కడ కూర్చునే వీలుగా బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. కుర్చీలు అందుబాటులోకి తేనున్నారు. తాగునీటి సదుపాయంతో పాటు మరుగుదొడ్లు అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పథకానికి ఎలక్ట్రిక్ బస్సులను విస్తరించే అవకాశం కనిపిస్తోంది. త్వరలో కేంద్రం సాయంతో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉంది. మహిళల ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి జీరో ఫేర్ టికెట్ ఇవ్వనున్నారు. మొత్తానికి అయితే ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు వచ్చేసాయి. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు కానుంది. దీంతో మహిళల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.