Microsoft Exits Pakistan: రాజకీయంగా స్థిరమైన పరిస్థితులు ఉండాలి. కట్టుదిట్టమైన భద్రత ఉండాలి. మానవ వనరులు విరివిగా లభించాలి. ఎగుమతులకు, దిగుమతులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ జోక్యం ఉండకూడదు. అప్పుడే కార్పొరేట్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు స్వేచ్ఛగా పనిచేయగలుగుతాయి. అలాంటి చోట వృద్ధి చెందడమే కాదు.. ఆ ప్రాంత ప్రజల ఆర్థిక అభివృద్ధికి కూడా కారణమవుతాయి. ఉద్యోగాలు కల్పిస్తాయి. ప్రభుత్వ రాబడి పెంపుదల లో తమ వంతు పాత్ర పోషిస్తాయి.. కానీ పై వాటిలో ఏది తేడా అయినా ఐటీ కంపెనీలు తమ ప్రస్థానాన్ని ముగించుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ప్రస్థానాన్ని అలానే ముగించింది.
మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కృత్రిమ మేధ, కొనుగోళ్లలో మందగమనం, ఆర్థికంగా అనిశ్చితి.. ఇవన్నీ కూడా ఐటీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలలో కోతను ఐటీ కంపెనీలు చేపడుతున్నాయి. ఉద్యోగాలలో కోత విధించినప్పటికీ.. తమ కార్యాలయాలను మాత్రం కంపెనీలు ఎత్తివేయలేదు. అయితే ప్రపంచ ఐటీ చరిత్రలో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని ఎత్తేసింది. అది కూడా 25 సంవత్సరాల పాటు పని చేసిన చోట కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రకటన అధికారికంగా రాకపోయినప్పటికీ.. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ సీఈవో ఈ విషయం చెప్పడంతో బయటికి వచ్చింది..” ఇక ఆ చరిత్ర గతం.. పాతిక సంవత్సరాల బంధం తెగిపోయింది. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ నాకు అఫీషియల్ గా చెప్పింది. కొంతమంది ఉద్యోగులకు ఈ సమాచారం అందించామని” పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా పనిచేస్తున్న వెల్లడించారు. సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం ఇతడి ఆధ్వర్యంలోనే మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. కేవలం కమర్షియల్ పరంగా కాకుండా పాకిస్తాన్ డిజిటల్ ప్రయాణంలో మైక్రోసాఫ్ట్ ముఖ్యపాత్ర పోషించింది. గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. వ్యాపారులకు సాంకేతికతను పరిచయం చేసింది.. పాక్ యువతకు శిక్షణ ఇచ్చింది.
Also Read: పాస్ పోర్ట్, వీసా అవసరం లేకుండా ఈ దేశానికి సులభంగా వెళ్లవచ్చు. ఆధార్ ఉంటే చాలు..
పాకిస్తాన్లో రాజకీయంగా గత కొంతకాలంగా దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి విషయంలో ఆర్మీ జోక్యం మితిమీరడంతో అక్కడి ప్రభుత్వం నామమాత్రం అయిపోతున్నది. పైగా మైక్రోసాఫ్ట్ కు టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం విపరీతంగా పన్నులు వేయడం కూడా మైక్రోసాఫ్ట్ ఇబ్బందిగా మారింది. పైగా పాకిస్తాన్ కరెన్సీ గత కొద్దిరోజులుగా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. గత ఆర్థిక సంవత్సరంలో పాక్ 24.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ఎదుర్కొంది. ఈ ఏడాది జూన్ నాటికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఈ పరిణమాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
Also Read: ఒకరికి తెలియకుండా మరొకరితో.. ఏకంగా ఆరుగురు.. చివరికి ఈ అమ్మాయి బండారం ఇలా బయటపడింది!
తాజా పరిస్థితులపై పాకిస్తాన్ మాజీ పాలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ” చూస్తుంటే బాధ కలుగుతుంది. అభివృద్ధి అనేది కనిపించడం లేదు. ఉన్న కంపెనీలు నిలబడటం లేదు. పెట్టుబడిదారులలో విశ్వాసం లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలో దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఎలా ముందడుగు వేస్తుంది? రాజకీయ అస్థిరత దారుణంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం నానాటికి తగ్గిపోతుంది. ఇలా అయితే దేశం ఏం బాగుపడుతుందని” పాక్ మాజీ పాలకులు తమ అసహాయతను వ్యక్తం చేస్తున్నారు.