Economic growth forex: భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా నిలపడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. 11 ఏళ్ల కాలంలో ఇప్పటికే 5వ స్థానానికి తీసుకువచ్చారు. రాబోయే ఐదేళ్లలో మూడో స్థానానికి తెస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించారు. మూడోసారి ప్రధాని ఐన ఏడాదికి దేశాన్ని మరో మెట్టు ఎక్కించారు. విదేశీ మారక నిల్వలలో (ఫారెక్స్) ప్రపంచంలో నాల్గవ స్థానంలో నిలిపారు. దీంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డేటా ప్రకారం, 2024 సెప్టెంబర్ నాటికి భారత్ ఫారెక్స్ నిల్వలు704.88 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి, ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, విదేశీ పెట్టుబడుల ఆకర్షణను సూచిస్తుంది.
Also Read: మైక్రో సాఫ్ట్ పాక్ నుంచి వెళ్లిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? అసలు ఇన్ని రోజులు ఉండడమే గొప్ప కదా?
రికార్డు స్థాయిలో విదేశీ మారక నిల్వలు..
2024 సెప్టెంబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 704.88 బిలియన్ డాలర్లకు చేరుకుని, చరిత్రలో మొదటిసారిగాు700 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటాయి. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది, చైనా (3.57 ట్రిలియన్), జపాన్ (1.2–1.3 ట్రిలియన్), స్విట్జర్లాండ్ (800 బిలియన్లకు పైగా) తర్వాత స్థానం మనదే. జూన్ 27, 2025 నాటికి నిల్వలు 4.84 బిలియన్లు పెరిగి 702.78 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ పెరుగుదల విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారు నిల్వలు, ఐఎంఎఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రిజర్వ్ పొజిషన్‌లో జమ అయిన నిధుల ద్వారా సాధ్యమైంది. ఈ ఆర్థిక బలం దేశాన్ని ఆర్థిక షాక్‌ల నుంచి రక్షించడంతోపాటు, రూపాయి స్థిరత్వాన్ని కాపాడుతుంది.
విదేశీ కరెన్సీ పెరుగుదల
భారత్ ఫారెక్స్ నిల్వలలో అతిపెద్ద భాగం విదేశీ కరెన్సీ ఆస్తులు, ఇవి 2025 జూన్ నాటికి 594.82 బిలియన్ డార్లకు చేరాయి. ఈ పెరుగుదలకు కారణం విదేశీ పెట్టుబడులు, ముఖ్యంగా జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో భారత బాండ్ల చేరిక తర్వాత 2024లో 30 బిలియన్ డాలర్ల్ల విదేశీ నిధుల ఆకర్షణ. అదనంగా, ఆర్‌బీఐ డాలర్ కొనుగోళ్లు, రూపాయి స్థిరీకరణ విధానాలు నిల్వల పెరుగుదలకు దోహదపడ్డాయి. ఈ ఆస్తులలో యుఎస్ డాలర్, యూరో, యెన్, పౌండ్ వంటి కరెన్సీలు, యుఎస్ ట్రెజరీ బాండ్లు, ఇతర ప్రభుత్వ బాండ్లు, విదేశీ బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక వృద్ధి విదేశీ వాణిజ్యం, రుణ చెల్లింపులను సులభతరం చేస్తుంది.
బంగారు నిల్వలు, ఎస్‌డీఆర్‌లు..
భారత్ ఫారెక్స్ నిల్వలలో బంగారు నిల్వలు (84.5 బిలియన్ డాలర్లు), స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (18.83 బిలియన్ డాలర్లు), ఐఎంఎఫ్ రిజర్వ్ పొజిషన్ (4.62 బిలియన్ డాలర్లు) కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2025 జూన్‌లో బంగారు నిల్వలు 1.23 బిలియన్ డాలర్లు తగ్గినప్పటికీ, ఈ నిల్వలు ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతున్నాయి.
Also Read: ఇండియాకు చైనా వార్నింగ్
రూపాయి స్థిరీకరణ..
ఫారెక్స్ నిల్వలు 11.9 నెలల దిగుమతులను కవర్ చేస్తాయని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇది ఆర్థిక స్థిరత్వానికి సంకేతం. 2024లో రూపాయి 83.50 స్థాయికి బలపడింది, దీనికి నిల్వల పెరుగుదల, విదేశీ పెట్టుబడులు దోహదపడ్డాయి. ఈ ఆర్థిక బలం విదేశీ పెట్టుబడిదారులకు, క్రెడిట్ రేటింగ్ సంస్థలకు విశ్వాసాన్ని కలిగిస్తుంది, దీనివల్ల దీర్ఘకాల రుణ సామర్థ్యం మెరుగుపడుతుంది.
1 ట్రిలియన్ లక్ష్యం
2014–15 ఆర్థిక సర్వే ప్రకారం, భారత్ 750 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలను లక్ష్యంగా చేసుకోవాలని సూచించింది. 2024లో సాధించిన 704.88 బిలియన్ డాలర్ల ఈ లక్ష్యానికి దగ్గరగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2026 నాటికి నిల్వలు 745 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. దీనికి బలమైన ఆర్థిక విధానాలు, విదేశీ పెట్టుబడులు, ఎగుమతుల పెరుగుదల, దిగుమతి ఆధారితత తగ్గింపు అవసరం. ఈ లక్ష్యం భారత్‌ను ఆర్థిక శక్తిగా మరింత బలోపేతం చేస్తుంది.