hibiscus : ఇంట్లో, ఇంటి ముందు మొక్కలు పెంచడం వల్ల అందంగా కనిపిస్తుంది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. కొన్ని మొక్కలు ఇంటికి మరింత ఎక్కువ అందాన్ని ఇస్తాయి. ఇక ఇండోర్ ప్లాట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని మొక్కలు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇక వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు మంచి ఫలితాలను, చెడు ఫలితాలను ఇస్తాయి. అయితే మీ ఇంట్లో మందారం ఉందా? అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం.
మొక్కలు పెంచుకోవటం ఇంటికి అందాన్ని ఇస్తుంటుంది. అంతేకాదు ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంటాయి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు ప్రకారం.. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవాలి. వీటిని పెంచుకోవడం వల్ల ఇంట్లో సమస్యలు తొలిగిపోతాయి. ఆర్థిక మానసిక లాభాలు పొందవచ్చు. ఇలాంటి ఫలితాలను అందించే మొక్కల్లో మందార మొక్క ఒకటి. అయితే ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో పెంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ అదృష్టానికి తిరుగుండదు.
మందార ఎన్నో రంగుల్లో లభిస్తుంది. చాలా మంది ఇంటి ముందు ఎక్కువగా ఎరుపు రంగు మందారాలు కనిపిస్తాయి. కానీ ఇవి తెలుపు, పసుపు, గులాబీ వంటి విభిన్న రంగుల్లో అందంగా కనిపిస్తూ ఆకర్షిస్తుంటాయి. మందార పువ్వు మీ తోట అందాన్ని పెంచుతూనే దేవుడికి ఎంతో ప్రీతికరమైనది ఉంటుంది కూడా. ఈ మందారం మొక్కను ఉత్తరం లేదా తూర్పు వైపున నాటాలి. ఇలా చేస్తే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అంటున్నారు నిపుణులు. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ పువ్వులు అంటే లక్ష్మిదేవికి చాలా ఇష్టం. ఆ అమ్మవారికి ఈ పూలను సమర్పించి పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా మందారంతో అమ్మవారికి పూజ చేస్తే మీ డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
మందార మొక్కను ఇంట్లో నాటడం వల్ల మంగళ దోషాలు పోతాయి. అంతేకాదు జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్న వారు కూడా ఈ మొక్కను నాటితే మంచి ఫలితాలు సంభవిస్తాయి. దీన్ని కూడా శుభప్రదంగా భావిస్తుంటారు. అయితే మందార పువ్వులు లేకుండా సూర్యునిని పూజించ కూడదు. అలా పూజిస్తే ఆ పూజ అసంపూర్ణంగా భావిస్తారు. సూర్య భగవానుడికి నీళ్లు సమర్పిస్తారు చాలా మంది. ఆ నీరును సమర్పించేటప్పుడు అందులో మందార పువ్వులను వేయాలి. మందార మొక్కను పూజ గదికి దగ్గరగా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులను తరిమి కొట్టవచ్చు. మందార మొక్కను శుక్రవారం నాడు ఇంటికి తెచ్చుకుంటే జాతకంలో గ్రహస్థితిని సరిచేసుకున్నట్టే. అయితే వాస్తు ప్రకారం, మందార మొక్కను శత్రువుకు బహుమతిగా ఇవ్వాలి అంటారు. ఇలా చేయడం వల్ల ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య ద్వేషాలను తగ్గించవచ్చట.