Anantapur: మందు బాబులం మేము బందుబాబులం మందేతాగితే మాకు మేమే మహారాజులం అని పాట విన్నారా? ఈ పాటకు తగ్గట్టుగా చాలా మంది చేస్తుంటారు. వారి వేషాలు చూస్తే అమ్మో ఇవేం వేశాలు రా బాబు అనిపిస్తుంటుంది. తాగినమా? రోడ్డు మీద బొర్లినమా? తాగింది దిగేదాక బదార్లో దొర్లినమా? అన్నట్టుగా కూడా కొందరు చేస్తుంటారు. తాగితే వారే ఈ దేశానికి, ప్రపంచానికి రాజులు అన్నట్టుగా కూడా చేస్తారు. మరి కొందరు గమ్మున పడుకుంటారు. ఇలాంటి వారు తక్కువ అయితే తాగి హంగామా చేసే వారు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారిని చూస్తే హే రామ్ ఏంటి వీళ్లు ఇలా చేస్తున్నారు? అనిపిస్తుంటుంది. కానీ ఎవరు చెప్పినా సరే వీరు మారరు. అయితే ఓ వ్యక్తి తాగి చేసిన పని చూస్తే మీరే పరేషాన్ అవుతారు. మరి ఇంతకీ ఆయన గారు చేసిన పని ఏంటో ఓ సారి చూసేయండి.
పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే దాని కాటుకు బలికావాల్సిందే. ఒక సారి పాము కాటేసిందంటే సరైన సమయంలో వైద్యం అందకపోతే మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇదంతా తాగడానికి ముందు అర్థం అవుతుంది. గుర్తు ఉంటుంది. కొందరికి తాగిన తర్వాతా అది పామా? తాడా అనేది కూడా అర్థం కాదు. అదే విధంగా చేశాడు ఓ డ్రింకర్. మద్యం మత్తులో దారిన పోయే పామును పట్టుకున్నాడు ఓ వ్యక్తి. మత్తు ఆయనను పాముతో చలగాట మాడేలా చేసింది.
ఈ సంఘటన అనంతపురం పట్టణంలోని టీవీ టవర్ వద్ద చోటు చేసుకుంది. ఓ మందు బాబు నాగుపాముతో హల్చల్ చేయడం ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. మద్యం మత్తులో పాముతో చెలగాటం ఆడాడు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అయ్యారు. పొదల్లోంచి రోడ్డు దాటుతున్న నాగుపామును పట్టుకున్నాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత పాముతో కూర్చొన్నాడు. అది కూడా ఆ పాము ముందు కూర్చోవడం మరో విశేషం. పామును చేత్తో పట్టుకుని ఆడించాడు. ఆ పాము బుసలు కొడుతుంది. కానీ ఈ మందుబాబుతో పామును చూసినవారు భయ పడ్డారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కూడా కాలేదు.
ఫుల్లుగా తాగి ఉన్నాడు. నషా బాగా ఎక్కడంతో పాముతో చాలా సేపు ఆడుకున్నాడు. పామును వదిలేయమని దగ్గరకొచ్చారు చాల మంది. అయినా సరే వదలలేదు. వారినే పాముతో కాటేయిస్తానంటూ బెదిరించాడు. రోడ్డుపై దాదాపు అరగంట ఆడారు. మందుబాబు చేసిన ఈ పనితో స్థానికులు భయం తో పరుగులు తీశారు. పాముకు ఎక్కడ కోపం వచ్చి మందుబాబును కాటేస్తుందోనని.. అందరూ భయపడ్డారు. కానీ ఈయన మాత్రం అసలు పట్టించుకోలేదు. అక్కడ ఉన్నవారు గట్టిగా మందలించడంతో చివరకు మందుబాబు పామును వదిలేసాడు. పాము ఏ మూడ్ లో ఉందో తెలియదు గానీ… మందు బాబు సేఫ్ అయ్యాడు. లేదంటే పాము కాటుకు బలయ్యేవాడు అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు.