https://oktelugu.com/

Breakup: బ్రేకప్‌ తర్వాత ఎవరికి బాధ ఎక్కువ? అమ్మాయికా లేదా అబ్బాయికా?

బ్రేకప్ తర్వాత అబ్బాయిలే ఎక్కువగా జీవితాలను పాడుచేసుకుని మద్యానికి అలవాటు పడుతుంటారని కొందరు అంటారు. మరికొందరు అమ్మాయిలే ఎక్కువ బాధ పడుతుంటారని అంటారు. అసలు బ్రేకప్ తర్వాత బాధ అమ్మాయిలకు ఎక్కువ ఉంటుందా? అబ్బాయిలకు ఉంటుందా? అనే విషయం పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 12, 2024 / 05:20 AM IST

    Breakup

    Follow us on

    Breakup: ప్రస్తుతం యువత ఎక్కువగా బ్రేకప్‌తో బాధపడుతున్నారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లు ఒక్కసారి దూరం అయితే తట్టుకోవడం కష్టం. కొందరు తొందరగా బ్రేకప్ నుంచి బయట పడితే మరికొందరు ఎన్ని ఏళ్లు అయిన ప్రేమించిన వాళ్లని మరిచిపోలేరు. మర్చిపోవడం చెప్పినంత ఈజీ కూడా కాదు. ప్రేమించిన వాళ్లని మరచిపోలేక చాలా మంది వాళ్ల కేరీర్ పాడుచేసుకోవడంతో పాటు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా ఈరోజుల్లో ఎక్కువ మంది మద్యం, ధూమపానానికి అలవాటు పడుతున్నారు. బాగా డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. దీనివల్ల మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రేకప్ తర్వాత అబ్బాయిలే ఎక్కువగా జీవితాలను పాడుచేసుకుని మద్యానికి అలవాటు పడుతుంటారని కొందరు అంటారు. మరికొందరు అమ్మాయిలే ఎక్కువ బాధ పడుతుంటారని అంటారు. అసలు బ్రేకప్ తర్వాత బాధ అమ్మాయిలకు ఎక్కువ ఉంటుందా? అబ్బాయిలకు ఉంటుందా? అనే విషయం పూర్తిగా తెలుసుకుందాం.

    బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ బాధ ఉంటుందట. బ్రేకప్ తర్వాత పడిన బాధను అమ్మాయిలు ఎవరితో ఒకరితో అయిన షేర్ చేసుకుంటారట. కానీ అబ్బాయిలు ఎవరితో కూడా షేర్ చేసుకోలేరని ఓ అధ్యయనం తెలుపుతుంది. అమ్మాయిలు బ్రేకప్ తర్వాత వేరే వాళ్లతో రిలేషన్‌లో ఉండటం లేదా పెళ్లి చేసుకుంటారు. కానీ అబ్బాయిలు మాత్రం ప్రేమించిన అమ్మాయిన గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటారు. అన్ని హ్యాపీ మూమెంట్స్‌ను గుర్తు చేసుకుంటూ బాధపడుతంటారు. ఎంతగా మరిచిపోవాలని అనుకున్న కూడా వారిని మరిచిపోలేరు. నలుగురిలో ఎంత సంతోషంగా ఉన్నా కూడా వారిని మరిచిపోకుండా ఎంతో బాధపడుతుంటారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే అందరూ అమ్మాయిలు కూడా ఇలా ఉండరని కొందరు భావిస్తున్నారు. ఎక్కువగా ప్రేమించే వారే చివరకు బాధపడతారని అంటున్నారు.

    కొందరు ఎన్ని రోజులు అయిన కూడా బ్రేకప్ బాధ నుంచి బయటకు రాలేరు. దీని నుంచి బయటకు రావాలంటే వర్క్ లైఫ్‌లో బిజీగా ఉండండి. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించండి. ఎందుకు అంటే సోషల్ మీడియా ఎక్కువగా వాడటం వల్ల మీరు ప్రేమించిన వ్యక్తి గురించి తెలిసే అవకాశం ఉంటుంది. వాటిని చూసి మీరు ఇంకా బాధపడవచ్చు. కాబట్టి మీ పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉండి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. అలాగే బ్రేకప్ అయ్యిందని ఒంటరిగా కూర్చుని బాధపడకుండా.. విహార యాత్రలకు వెళ్లండి. కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల మనసుకు హాయి తగులుతుంది. కొత్త పరిచయాలు, కొత్త ప్లేస్ వల్ల ప్రేమించిన వ్యక్తిని మరిచిపోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాతావరణం మనకు చాలా నేర్పుతుంది. దీని వల్ల ఈజీగా మీరు ప్రేమించిన వ్యక్తిని మరిచిపోతారు. అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎక్కువ సమయం గడపండి. ఇలా చేస్తుంటే మీరు కొంత వరకు బ్రేకప్ బాధ నుంచి బయటపడతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.