Pressure Cooker: అన్నం దగ్గర్నుంచి పప్పు, ఖీర్, మటన్ వరకు చాలా వంటకాలు కుక్కర్ లోనే వండుతారు. ఇందులో అయితే ఫాస్ట్ గా ఉడికిపోతాయి కదా.ఇలా చేస్తే గ్యాస్ కూడా ఆదా అవుతుంది. కానీ పెషర్ కుక్కను చాలా జాగ్రత్తగా వాడితేనే ఎలాంటి సమస్యలు రావు. లేదంటే పేలుతుంది ప్రెజర్ కుక్కర్. ఈ కుక్కర్ హ్యాండిల్ లోని రబ్బరు పీడనం, ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చాలా అవసరం అవుతుంది. అయితే దీనిని కదిలించినప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.
ప్రెషర్ కుక్కర్ ను వాడే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో వాటర్ లీకేజీ ముఖ్యంగా ఉంటుంది. దీనివల్ల స్టవ్ మొత్తం మురికిగా తయారు అవుతుంది. దాన్ని క్లీన్ చేయడానికి మళ్లీ సమయం పడుతుంది. అసలు ఈ వాటర్ లీకేజీని ఆపడానికి ఏం చేయాలి అని టెన్షన్ పడుతున్నారా? అసలు టెన్షన్ పడవద్దు. జస్ట్ ఈ ఆర్టికల్ చదివేసేయండి.
రబ్బరుకు చెక్ : కుక్కర్ మూతపై ఉన్న రబ్బరు వంట చేయడానికి చాలా అవసరం అవుతుంటుంది. అయితే దీన్ని కంటిన్యూగా వాడితే వదులుగా అవుతుంది కాబట్టి వాటర్ లీకేజీకి దారితీస్తుంది. అందుకే వదులుగా ఉన్న రబ్బరు మూతను గట్టిగా చేయడానికి ప్రయత్నిస్తుండాలి. కుక్కర్ లో వంట అయిన తర్వాత ఈ రుబ్బరు మూతను చల్ల నీల్లలో ముంచి పెట్టండి. ఇలా చేస్తే దీని లైఫ్ టైం పెరుగుతుంది. అలాగే కుక్కర్ నుంచి వాటర్ లీకేజీ సమస్య ఉండదు.
విజిల్ కండిషన్: కుక్కర్ విజిల్ లో ఆహార కణాలు అస్సలు ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే వీటిలో ఏవైనా ఉంటే ఆవిరికి ఆటంకం కలిగిస్తుంటుంది. దీని వల్ల లీకేజీ అవుతుంది. విజిల్ ని ఓపెన్ చేసేటప్పుడు కూడా చెక్ చేయాలి. కుక్కర్ వాష్ చేసేటప్పుడు విజిల్ ను కూడా మంచిగా వాష్ చేయాలి. సో సమస్య ఉండదు.
నూనె ను వాడండి: ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకేజీ అవకుండా జాగ్రత్త పడాలంటే నూనె బాగా పనిచేస్తుంది. తేమను నిలుపుకోవడానికి, వాటర్ లీకేజీ ఆగడానికి కుక్కర్ మూత చుట్టూ నూనెను రాసి కుక్కర్ ను ఉపయోగించండి.
చల్లటి నీరు: నీటి లీకేజీని ఆపడానికి వంట చేయడానికి ముందు ప్రెజర్ కుక్కర్ ను చల్లని నీళ్లతో కడగి వాడటం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఓవర్ ఫిల్లింగ్ వద్దు: కుక్కర్ నిండా వండవద్దు. ఇలా చేస్తే కుక్కర్ నుంచి వాటర్ లీకేజీ అవదు. అందుకే ప్రెషర్ కుక్కర్ లో గరిష్టంగా సూచించిన లైన్ వరకు మాత్రమే నింపి వంట చేయాలి. అలాగే వంట చేసేటప్పుడు పదార్ధాలను ఎంత వరకు వేయాలో చూసుకోవడం బెటర్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.