Tiger Nuts : ఒక్కసారి టైగర్ నట్స్ తిని చూడండి.. జీవితంలో వదిలిపెట్టరు!

టైగర్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. వీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ నట్స్‌పై పులిలా ఉండే ఛారలు ఉంటాయి. అందుకే వీటిని టైగర్ నట్స్ అంటారు. అలాగే ఎర్త్ ఆల్మండ్, ఎల్లో నట్స్, రష్ నట్స్ వంటి అనేక పేర్లతో కూడా పిలుస్తారు. మరి వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

Written By: Suresh, Updated On : September 23, 2024 1:33 pm

Tiger Nuts

Follow us on

Tiger Nuts : ఆరోగ్యానికి మేలు చేసే పదార్ధాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నట్స్, డ్రైఫూట్స్ వంటివి తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే నట్స్‌లో ఆరోగ్యానికి మేలు ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ అన్నింటి గురించి కొందరికి తెలియదు. అలాంటి వాటిలో ఈ టైగర్ నట్స్ ఒకటి. మనలో చాలామందికి వీటి గురించి అసలు తెలీదు. చిన్నగా బాదం సైజ్‌లో ఉండే వీటిని తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మ టైగర్ నట్స్ చూడటానికి చాలా చిన్నగా ఉన్నా కూడా పోషకాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. వీటిని డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. వీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ నట్స్‌పై పులిలా ఉండే ఛారలు ఉంటాయి. అందుకే వీటిని టైగర్ నట్స్ అంటారు. అలాగే ఎర్త్ ఆల్మండ్, ఎల్లో నట్స్, రష్ నట్స్ వంటి అనేక పేర్లతో కూడా పిలుస్తారు. మరి వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

జీర్ణక్రియ
టైగర్ నట్స్‌లో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సాయపడుతుంది. తిన్నఆహారం తొందగా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్దకం సమస్యను తగ్గించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఎముకలు ఆరోగ్యంగా..
ఇందులో ఉండే కాల్షియం ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఇందులో మొత్తం 18 రకాల అమైనో యాసిడ్లు ఉన్నాయి. వీటివల్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఇది మొక్కల నుంచి వచ్చే ప్రొటీన్. గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రొటీన్ అందుతుందో.. టైగర్ నట్స్‌తో అన్ని ప్రొటీన్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి.

గుండెకి మేలు
టైగర్ నట్స్‌లో ఉన్న మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బుల వంటి ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది. మిగతా నట్స్‌లా డైలీ వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

చక్కెర స్థాయిలు
శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా టైగర్ నట్స్ కాపాడతాయి. వీటిని రోజూ తినడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే ఇందులోని అర్జినిన్ అమైనో ఆమ్లం చక్కెర స్థాయిలు పెరగకుండా చేసి.. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సాయపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ క్యాన్సర్ కణాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. రోజూ వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాబట్టి తప్పకుండా వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగ ఉంటారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.