https://oktelugu.com/

Eating Mutton : మటన్ ఎక్కువగా తింటున్నారా.. అయితే మీకు డయాబెటిస్ ముప్పు తప్పదు!

మటన్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే డయాబెటిస్‌కి కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంత మేలు చేసే పదార్థం అయిన కూడా లిమిట్‌లో మాత్రమే తినాలి. ఎక్కువగా తినడం వల్ల తప్పకుండా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది

Written By:
  • Srinivas
  • , Updated On : September 23, 2024 1:25 pm
    Eating Mutton

    Eating Mutton

    Follow us on

    Eating Mutton :  మనలో ఎక్కువ శాతం మంది నాన్‌వెజ్ ప్రియులు ఉంటారు. వాళ్లకు ముక్క లేనిదే ముద్ద దిగదు. మూడు పూటు మాంసం పెట్టిన తినేస్తారు. ఒక్కరోజు వెజ్ కర్రీ వండితే.. రోజు ఇదేనా అంటారు. అంతలా నాన్ వెజ్‌కి ఎడిక్ట్ అయిపోతారు. సాధారణ రోజులతో పోలిస్తే.. వీకెండ్ వచ్చిందంటే తప్పకుండా నాన్‌వెజ్ ఉండాల్సిందే. వీకెండ్‌లో నాన్‌వెజ్ లేకపోతే అసలు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఆకలి తీరడానికి తింటారు. కానీ ఇష్టంగా తినరు. అయితే నాన్‌వెజ్‌లో చాలామంది మటన్ ఎక్కువగా తింటారు. చికెన్ కంటే మటన్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని భావించి అధికంగా తింటారు. అయితే మటన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయి. కానీ షుగర్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మటన్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే డయాబెటిస్‌కి కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంత మేలు చేసే పదార్థం అయిన కూడా లిమిట్‌లో మాత్రమే తినాలి. ఎక్కువగా తినడం వల్ల తప్పకుండా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది.

    మటన్ తినడం వల్ల ప్రొటీన్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి బలాన్ని ఇస్తుంది. కానీ ఎక్కువ సార్లు మటన్ తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడటం తప్పనిసరి. అధికంగా మటన్ తింటుంటే.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మటన్ తినని వాళ్లతో పోలిస్తే.. తినే వాళ్లలో డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దాదాపు పదేళ్లుగా మటన్ అధికంగా తినే వాళ్లను పరిశీలించారు. వారానికి ఒకసారి తినే వాళ్లలో ఎలాంటి ప్రమాదం లేదని అంతకు మించి ఎక్కువసార్లు తినే వాళ్లలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. మటన్ తినే వాళ్లలో డయాబెటిస్ టైప్ 2 వచ్చే అవకాశాలు 15 శాతం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మటన్‌లో హానికారిక శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి సహజ ఇన్సులిన్‌ విడుదలను అడ్డుకుంటాయి.

    ఎక్కువ సార్లు మటన్ తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటామనే అపోహలో ఎక్కువగా తినవద్దు. కాస్త లిమిట్‌లో మాత్రమే తినాలి. ఈరోజుల్లో ఫుడ్ ఎక్కువగా ప్యాకింగ్‌లో నిల్వ ఉన్నది లభిస్తుంది. తాజాగా దొరకడం కష్టం అవుతుంది. ఇలా ప్యాకేజ్డ్ ఉన్న మటన్ అధికంగా తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తినాలని అనిపిస్తే చేపలు తినడం మంచిది. వీటి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏ ఆహారాన్ని తీసుకున్న తాజాగా ఉండేవి తీసుకోవడం మేలు. ఇలా ప్యాకేజ్డ్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఏదో ఒక అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి నిల్వ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అలాగే మటన్ తినడం కాస్త తగ్గించండి. వారానికి ఒకసారికి మించి ఎక్కువగా తినకండి.