Chicken – Eggs: సాధారణంగా శీతాకాలం అనగానే చలి ఎక్కువగా ఉంటుంది కనుక చాలా మంది మాంసాహారం ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అందుకే ఈ డిసెంబర్ ,జనవరి మాసాలలో చికెన్ గుడ్లు ధరలు అధికంగా ఉంటాయి. గత ఏడాది డిసెంబర్ నెల వరకు ఇదే అధిక రేట్లు కొనసాగిన జనవరి మూడవ తేదీ నుంచి ఒక్కసారిగా మాంసం, గుడ్ల ధరలు పడిపోయాయి. ఇలా ఉన్నఫలంగా వీటి రేట్లు తగ్గడానికి గల కారణం కరోనా అనే చెప్పాలి.
రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధించాయి. అలాగే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో గుడ్లు చికెన్ సరఫరాపై అధిక ప్రభావం పడటం వల్ల మార్కెట్ లో గుడ్లు చికెన్ ధరలు పూర్తిగా పడిపోయాయి. ప్రస్తుతం దుకాణాలలో 30 గుడ్లు రెండు వందల రూపాయల వరకు ధర పలికాయి. అలాంటిది ప్రస్తుతం 30 కోడిగుడ్లు 150 రూపాయలకే లభ్యమవుతున్నాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో గుడ్లు అత్యంత చౌక ధరలకే లభిస్తాయి. ఇక్కడ 100 గుడ్లు కేవలం 450 రూపాయలు మాత్రమే మనకు లభిస్తాయి. కరోనా కర్ఫ్యూ విధించక ముందు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు సుమారు ఎనిమిది నుంచి పది రూపాయల వరకు అమ్ముడుపోయేవి. కర్ఫ్యూ ప్రభావంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు7 రూపాయలకే లభ్యమవుతుంది. ఢిల్లీలోని అతిపెద్ద చికెన్ మార్కెట్ అయినా ఘాజీపూర్ వ్యాపారులు మాట్లాడుతూ కరోనా ప్రభావం వల్ల పెద్ద పెద్ద రెస్టారెంట్లు హోటల్ యాజమాన్యం చికెన్ ఆర్డర్లు చాలావరకు తగ్గించారని పది రోజుల క్రితం వరకు 200 రూపాయల కిలో చికెన్ ఇప్పుడు 150 రూపాయలకు మాత్రమే లభిస్తోందని తెలియజేశారు.