https://oktelugu.com/

Bigg Boss 5: సిరికి షాక్ ఇచ్చిన శ్రీహన్… దీప్తి బాటలో వెళ్లనున్నాడా ?

Bigg Boss 5: బిగ్ బాస్ 5 తెలుగు రెండు జంటల మధ్య చిచ్చు పెట్టేసింది. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే జరుగుతుంది. సీజన్ అయితే బాగానే ముగిసింది కానీ వివాదాలు కూడా అలాగే వచ్చాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాలపై కూడా బిగ్ బాస్ 5 తెలుగు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొందరు కంటెస్టెంట్స్ బయటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ జరిగిన కొన్ని తప్పుల కారణంగా బయటికి వచ్చిన తర్వాత సఫర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 6, 2022 / 10:20 AM IST
    Follow us on

    Bigg Boss 5: బిగ్ బాస్ 5 తెలుగు రెండు జంటల మధ్య చిచ్చు పెట్టేసింది. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే జరుగుతుంది. సీజన్ అయితే బాగానే ముగిసింది కానీ వివాదాలు కూడా అలాగే వచ్చాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాలపై కూడా బిగ్ బాస్ 5 తెలుగు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొందరు కంటెస్టెంట్స్ బయటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ జరిగిన కొన్ని తప్పుల కారణంగా బయటికి వచ్చిన తర్వాత సఫర్ అవుతున్నారు.

    బిగ్‌బాస్ 5 సీజన్లో సిరి-షణ్ముక్ మధ్యలో నడిచిన హగ్గుల పర్వం ప్రేక్షకులకే కాదు, వారిని ప్రేమించినవారికి కూడా చిరాకు తెప్పించింది. ఇప్పటికే షన్నూతో తన అయిదేళ్ల ప్రేమకు దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు అదే బాటలో సిరి కాబోయే భర్త శ్రీహాన్ కూడా నడవబోతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ కు వెళ్లకముందే సిరి – శ్రీహాన్‌లకు నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇద్దరూ కలిసి ఒక బాబును కూడా దత్తత తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన సిరి, షన్నూకు దగ్గరైంది. తమ మధ్య కనెక్షన్ వస్తుందంటూ నాగార్జునకే చెప్పింది.

    దీంతో ఈ విషయంలో శ్రీహాన్ కూడా చాలా హర్ట్ అయినట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే బిగ్ బాస్ నుంచి సిరి వచ్చాక కూడా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒక్కటీ బయటికి రాలేదు. ఇక శ్రీహాన్ తాజాగా సిరి తాను కలిసి ఉన్న ఫోటోలను ఇన్ స్టా ఖాతా నుంచి తొలగించాడు. కేవలం ఇద్దరూ కలిసి చేసిన యూట్యూబ్ సిరీస్‌ల ఫోటోలు మాత్రమే ఉంచాడు. దీన్ని బట్టి శ్రీహాన్ కూడా దీప్తి సునయన బాటలో నడవనున్నాడని, బ్రేకప్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం.