Home Tips: మనం అన్నం వండాలంటే బియ్యం నానబెడతాం. దోసెను వేయాలంటే రాత్రి మినపపప్పుతో పాటు బియ్యం నానబెట్టుకుంటాం. ఇలా నానబెట్టిన వాటిని ఆహారంగా చేసుకుంటాం. మరీ ఎక్కువ సేపు కాకుండా ఓ ఐదారు గంటలు నానబెట్టి తయారు చేసుకుంటాం. ఈ నేపథ్యంలో ఏ పప్పును ఎంత సేపు నానబెట్టాలో తెలుసుకుంటే సరి. ఇటీవల కాలంలో బయట తీసుకొచ్చిన వంటలనే ఎక్కువగా తింటున్నారు. అందులో వారు అన్ని కరెక్టుగా వేశారో లేదో తెలియదు. శుభ్రంగా చేశారో కూడా మనకు అర్థం కాదు. అందుకే మన వంటలను మనమే తయారు చేసుకుంటే ఎంతో మంచిది. వంట మనం చేసుకుని తింటే అందులో ఉండే మజాయే వేరు.

మినపపప్పు, పెసరపప్పు ఏదైనా సరే నానబెడితే అందులో పోషకాలు పెరుగుతాయి. దీంతో మనకు ఆరోగ్యం కలుగుతుంది. నానబెట్టిన వాటిని రుబ్బితే ఎక్కువ పిండి వస్తుంది. జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది. కందిపప్పు, శనగపప్పు, బీన్స్, రాజ్ మా, శనగలు వంటి వాటిని నానబెట్టినప్పుడు అందులో ఫైటీస్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీంతో మనం నానబెట్టి తినడం వల్ల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఇందులో అమైలేస్ అనే ప్రక్రియ కూడా జరుగుతుంది. దీని వల్ల పప్పు లూజుగా అవుతుంది. దాన్ని తిన్నప్పుడు మనకు ఎసిడిటి సమస్యలు రావు.
కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు వంటి వాటిని కనీసం 6 నుంచి 8 గంటలు నానబెట్టాలి. మినుములు, పెసలు వంటి వాటిని 8 నుంచి 12 గంటలు నీటిలో ఉంచాలి. శనగలు, బీన్స్, రాజ్ మా వంటి వాటిని 12 నుంచి 18 గంటలు నానబెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వీటితో టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఉదయం కోసం రాత్రి నానబెడుతుంటారు. వేటినైనా నానబెట్టాలనుకున్నప్పుడు కనీసం మూడు సార్లు శుభ్రంగా కడగాలి. రెండు సార్లు మొత్తం పిసికి కడిగితే ఎలాంటి దుమ్ము లేకుండా శుభ్రంగా మారుతాయి. కడగడం వల్ల పోషకాలు పోవు.

ఇలా మనం తీసుకునే పిండి పదార్థాలు ఒక రోజు ముందే నానబెట్టుకుని టిఫిన్ గా తయారు చేసుకుంటే శ్రేయస్కరం. పులియబెట్టిన పిండిలో కూడా మంచి బ్యాక్టీరియా చేరుతుంది. దీంతో మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉదయం తింటే కూడా మంచి లాభమే. పెరుగు కూడా ఒక రోజు పులియబెడితే పుల్లగా మారుతుంది. పుల్లటి పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నేపథ్యంలో మనం తీసుకునే పప్పుల్లో నానబెట్టడం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకోవడం వల్ల వాటిని ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.