Face While Eating- Vastu: ప్రస్తుత కాలంలో వాస్తుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్న ఊర్ల నుంచి పెద్ద పట్టణాల వరకు ఎక్కడ చూసినా వాస్తునే నమ్ముతున్నారు. వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని తాపత్రయపడున్నారు. దీంతో వాస్తుకు విలువ పెరుగుతోంది. ఇల్లు కట్టాలంటే వాస్తు చూడాల్సిందే. వాస్తు ప్రకారమే ముగ్గు పోసి ఆ ప్లాన్ ప్రకారమే ఇంటిని నిర్మాణం చేస్తున్నారు. ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా మొత్తం ఇంటినే కూల్చడానికి కూడా వెనకాడటం లేదంటే అతిశయోక్తి కాదని తెలిసిందే. ఈ నేపథ్యంలో వాస్తు ప్రభావం ప్రస్తుతం ఎక్కువగా పాటిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తు చూసుకున్నాకే స్థలాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. అంతా పక్కా వాస్తు ఉంటేనే ముందుకు రావడం గమనార్హం.

వాస్తుకు ఉన్న ప్రాముఖ్యత అలాంటిది మరి. ఇల్లు కట్టాలంటే వాస్తు ప్లాన్ ఉండాల్సిందే. లేకపోతే ఇల్లు కట్టడం లేదు. వాస్తుకు ఉన్న విలువ అంతలా పెరిగిపోయింది. వాస్తు ప్రభావంతో చాలా పనులు సాగుతున్నాయి. తూర్పు దిశలో ఇంద్రుడు, పడమరలో వరుణుడు, ఉత్తరంలో కుబేరుడు, దక్షిణంలో యముడు, ఈశాన్యంలో ఈశ్వరుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, వాయువ్యంలో వాయుదేవుడు, నైరుతిలో రాక్షసుడు ఉంటాడని నమ్మకం. అందుకే వాస్తు ప్రకారం దిక్కులు, దిశలు చూసుకుని నడుచుకుంటూ ఉంటారు.
Also Read: Charmy Kaur: ప్రేమ పేరు తో ఛార్మిని నమ్మించి మోసం చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు
భోజనం చేసే విషయంలో కూడా వాస్తు పద్దతులు పాటించాలని సూచిస్తున్నారు. ఏ దిక్కులో కూర్చుని తిన్నా దక్షిణ దిశలో మాత్రం కూర్చోవద్దు. అటు యముడు ఉంటాడని తెలిసినందున ఎవరైనా భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణం వైపు ఉండకూదని చెబుతుంటారు. దక్షిణ దిశలో యముడు ఉండటం వల్ల మనకు అనారోగ్యాలు చుట్టుముడతాయట. అందుకే వాస్తు పద్ధతులు పాటించే వారు ఎప్పుడు కూడా దక్షిణం వైపు కూర్చుని తినడం మంచి పద్ధతి కాదని తెలుస్తోంది.

తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని తింటే మంచిదే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయడం మంచిది కాదని తెలుసుకోవాలి. పడుకునే మంచం మీద కూర్చుని తింటే అనర్థమే. అందుకే ఎప్పుడైనా మంచం మీద కూర్చుని తినడం మంచిది కాదని తెలుసుకోవాలి. తూర్పు దిశగా కూర్చుని తింటే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. అందుకే ఎప్పుడైనా ఎక్కువగా తూర్పు వైపుకు తిరిగి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. పడమర దిశలో కూర్చుని తింటే లాభాలు వస్తాయని నమ్మకం. అందుకే పడమర వైపు కూడా కూర్చుని తింటూ మీ వ్యాపార లావాదేవీలు పెంచుకోవాలని సూచిస్తున్నారు.
Also Read:Nancy Pelosi Taiwan Visit: చిచ్చుపెట్టిన అమెరికా.. తైవాన్ పై చైనా యుద్ధం చేయబోతుందా?