https://oktelugu.com/

Samantha Pushpa 2: ఈసారి సమంత ఐటెం గర్ల్ కాదట.. పుష్ప-2లో అదిరిపోయే పాత్ర

Samantha Pushpa 2: పుష్ప.. పుష్పరాజ్.. నీ యవ్వ తగ్గేదేలే.. అంటూ దేశ సినీ రంగాన్ని అల్లు అర్జున్ షేక్ చేసి పడేశాడు. ‘షెకావత్’ సార్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. ఒక్కో పాత్ర జీవంలా ఉట్టిపడింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ప్యాన్ ఇండియా లెవల్ లో దుమ్మురేపిన ఈ సినిమా పార్ట్ 2 కు రెడీ అవుతోంది. పుష్ప ముందు అనుకున్న కథ కంటే కూడా ఈసారి అంతకుమించి తీయబోతున్నారట.. ఈక్రమంలోనే కథలో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 3, 2022 / 05:40 PM IST

    Samantha Pushpa 2

    Follow us on

    Samantha Pushpa 2: పుష్ప.. పుష్పరాజ్.. నీ యవ్వ తగ్గేదేలే.. అంటూ దేశ సినీ రంగాన్ని అల్లు అర్జున్ షేక్ చేసి పడేశాడు. ‘షెకావత్’ సార్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. ఒక్కో పాత్ర జీవంలా ఉట్టిపడింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ప్యాన్ ఇండియా లెవల్ లో దుమ్మురేపిన ఈ సినిమా పార్ట్ 2 కు రెడీ అవుతోంది.

    పుష్ప ముందు అనుకున్న కథ కంటే కూడా ఈసారి అంతకుమించి తీయబోతున్నారట.. ఈక్రమంలోనే కథలో మార్పులు చేర్పులు.. స్టార్ కాస్ట్ కు అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలిసింది. సమంత కూడా పుష్ప2లో భాగం కాబోతోందన్న వార్త ఒకటి వైరల్ అవుతోంది.

    పుష్పలో బన్నీ పక్కన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సమంత ఓ ఐటెం సాంగ్ లో మెరిసింది. ఈ ఐటెం సాంగ్ అందరినీ ఊపు ఊపేసింది. ‘ఊ అంటావా’ అంటూ దేశాన్ని షేక్ చేసింది. పుష్పలో ప్రధాన హైలెట్ బన్నీ, రష్మిక కెమిస్ట్రీనే. అది బాగా పండింది. అయితే దర్శకుడు సుకుమార్ ఫేవరెట్ హీరోయిన్ ‘సమంత’నే. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. ఆమె నటనలో ఒక ప్రత్యేకత కారణంగానే ‘రంగస్థలం’ సినిమాలో ఆమెను ఎంచుకున్నారు. పుష్పలోనూ ఐటెం సాంగ్ లో నర్తించింది.

    ప్రస్తుతం ‘పుష్ప1’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రెండో భాగం ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అందరూ సెకండ్ పార్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుక్కూ అండ్ టీం ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని సమాచారం. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ అదిరిపోతుందని.. .. యాక్షన్, ఎలివేషన్ సీన్స్ అదిరిపోయేలా తీర్చిదిద్దారట..

    ఇక పుష్ప2లో భన్వర్ లాల్ షెకావత్, మంగళ శీను, ద్రాక్షాయని పాత్రలు కంటిన్యూ అవ్వనున్నట్టు తెలిసింది. కొత్తగా విజయ్ సేతుపతిని జాయిన్ చేయనున్నారట.. ఇక ఇందులో ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగిన సమంత కూడా ఇన్ వాల్వ్ కానుందట.. పార్ట్ 1లో ఐటెం సాంగ్ చేసిన సమంతను ఈసారి పార్ట్ 2లో అల్లు అర్జున్ కు సాయం చేసే స్నేహితురాలి పాత్రలో సమంతను తీర్చిదిద్దబోతున్నాడట సుకుమార్. ఈ మేరకు సమంత పాత్రను డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.. ఇదే జరిగితే దీనికి మరింతగా ప్యాన్ ఇండియా లుక్ రావడం ఖాయమని అంటున్నారు.