Charmy Kaur: టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ ని సంపాదించిన హీరోయిన్స్ లో ఒకరు ఛార్మి కౌర్..తన అందచందాలతో కుర్రకారుల మతులను పోగొట్టడమే కాదు..తన అద్భుతమైన నటన మరియు డాన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంట్ ఛార్మి లో ఉంది..అయితే కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్న సమయం లో హీరోయిన్ గా ఛార్మి క్రేజ్ తగ్గుతూ వచ్చింది..ఆమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘జ్యోతి లక్ష్మి’..ఛార్మి నిర్మాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది..ఈ సినిమా షూటింగ్ సమయం లోనే పూరి జగన్నాథ్ ఛార్మి కి బాగా దగ్గర అవ్వడం తో ఆయనతో కలిసి వరుసగా సినిమాలు నిర్మించడం ప్రారంభించింది..వీళ్లిద్దరు కలిసి నిర్మించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నిలిచాయి..ఆర్థికంగా కూడా బాగా నష్టపోయారు..అలాంటి సమయం లో రామ్ ని హీరో గా పెట్టి తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించింది..ఈ ఒక్క సినిమా తో ఛార్మి – పూరి జగన్నాథ్ కష్టాలన్నీ తీరిపోయాయి.
ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వీళ్లిద్దరు కలిసి విజయ్ దేవరకొండ ని హీరో గా పెట్టి పాన్ ఇండియన్ లెవెల్ లో లైగర్ అనే సినిమాని తెరకెక్కించారు..ఈ సినిమాకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది..ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే టీజర్ మరియు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం తో పూరి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ అని ట్రేడ్ గట్టిగా నమ్ముతుంది..ఇది పక్కన పెడితే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఛార్మిని ఒక విలేకరి ప్రశ్న అడుగుతూ ‘మీకు 35 ఏళ్ళు వచ్చి ఉంటాయి.
Also Read: Thank You Movie Closing Collections: నాగచైతన్య థాంక్యూ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్
ఇంకా మీరెందుకు పెళ్లి చేసుకోలేదు..అసలు పెళ్లి చేసుకుంటారా లేదా’ అని అడిగిన ప్రశ్న కి ఛార్మి సమాధానం చెప్తూ ‘ఇప్పటికే ప్రేమ మరియు పెళ్లి విషయం లో ఒకడిని నమ్మి దారుణంగా మోసపోయాను..ఇక అప్పటి నుండి దాని జోలికే పోలేదు’ అంటూ చెప్పుకొచ్చింది..ఇంతకీ ఆమె పరోక్షంగా కామెంట్స్ విసిరింది ఎవరి పైనో కాదు..మన మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీప్రసాద్ పై..అప్పట్లో ఛార్మి దేవిశ్రీప్రసాద్ తో ప్రేమాయణం నడిపింది..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు అని ఇండస్ట్రీ లో వార్తలు తెగ ప్రచారమైన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ ఎందుకో ఈ వీళ్లిద్దరి ప్రేమాయణం పెళ్లిపీటలు వరుకు వెళ్లలేకపోయింది..అప్పటి నుండి ప్రేమ పెళ్లి విషయం లో ఛార్మి చాలా కఠినంగా తయారు అయిపోయింది అని తెలుస్తుంది.
Also Read:Chiranjeevi – Pawan Kalyan: చిరంజీవి కోసం పేరు మోసిన రౌడీ షీటర్ ని చితకబాదిన పవన్ కళ్యాణ్