Effect of Mobile Phones on Children : ప్రస్తుతం సెల్‌ఫోన్ యుగం నడుస్తోంది. ఎవర్ని చూసిన మొబైల్ పట్టుకునే వారే ఎక్కువగా ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా మొబైల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు. ఏకధాటిగా మొబైల్ ఫోన్ చూడటం వల్ల కళ్ల సమస్యలు వస్తాయని తెలిసిన కూడా వినకుండా చూస్తుంటారు. కాస్త సమయం విశ్రాంతి దొరికితే చాలు.. ఆ మొబైల్ ఫోన్‌లో మునిగిపోతారు. ముఖ్యంగా పిల్లలు అయితే మొబైల్ ఫోన్ చూడకూడదని నిపుణులు చెబుతుంటారు. అయిన వినకుండా పిల్లలు తల్లిదండ్రులు ఫోన్ ఇస్తుంటారు. ఒకప్పుడు రోజుల్లో చందమామను చూపించి పిల్లలను తినిపించేవారు. కానీ ఈరోజుల్లో మొబైల్ ఫోన్ చూపిస్తూ పిల్లలకు తినిపిస్తున్నారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారికి అసలు మొబైల్స్ ఇవ్వకూడదు. వాళ్లకు సరైన వయస్సులో మాత్రమే చేతికి మొబైల్స్ ఇవ్వాలి. అయితే పిల్లలకు ఏ వయస్సులో మొబైల్ ఫోన్ ఇవ్వాలి? ఇచ్చిన ఎంత సమయం స్క్రీన్ చూపించాలి? పూర్తి వివరాలు చూద్దాం.
సాధారణంగా ఎవరైనా మొబైల్ ఎక్కువగా వాడకూడదు. పిల్లలకు అయితే అసలు ఇవ్వకూడదు. ఒకవేళ పిల్లలు మారాం చేసి ఇవ్వాలంటే ఆరేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఇవ్వాలి. అది కూడా రోజుకి కేవలం గంట మాత్రమే ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లలకు అయితే అసలు ఇవ్వకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు అధికంగా మొబైల్ ఫోన్స్ చూడటం వల్ల బ్రెయిన్ డెడ్ కావడం, మెదడు పనితీరు తగ్గిపోవడం, కంటి చూపు, దేనిని కూడా ఫోకస్ చేయకపోవడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా మొబైల్స్ వారికి ఇస్తే ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడతారు. అదే కుటుంబ సభ్యులతో కలవడం, మాట్లాడటం, ఆడుకోవడం, పుస్తకాలు చదవడం వంటివి పిల్లలకు నేర్పించాలి. వాళ్లు మొబైల్ పట్టుకోకుండా ఉండే విధంగా పిల్లలకు అలవాటు చేయాలి. ముఖ్యంగా రాత్రి తిన్న తర్వాత పిల్లలకు అసలు మొబైల్ ఇవ్వకూడదు. పిల్లలు కావాలని ఇబ్బంది పెడితే.. మొబైల్‌కి స్క్రీన్ టైం సెట్ చేసుకోండి. లేకపోతే బాగా చదివితే పెద్ద అయిన తర్వాత ఇస్తామని కండిషన్లు పెట్టండి. మొబైల్ మంచి కోసం మాత్రమే వినియోగించేలా పిల్లలకు నేర్పించండి. వాళ్లకు మొబైల్ ఇచ్చినప్పుడు పక్కన ఉండి కాస్త గమనించండి. అప్పుడే వాళ్లు ఎలాంటి చెడు అలవాట్లకు బానిస కారు. ఈ మొబైల్స్ చూడటం వల్లే పిల్లలు చెడు అలవాట్లకు ఎక్కువగా బానిస అవుతుంటారు. చిన్నప్పుడే పిల్లలకు అన్ని విషయాల్లో కట్ చేయాలి. లేకపోతే పెద్ద అయిన తర్వాత వారిని మార్చడం ఎవరి తరం కాదు. కాబట్టి తల్లిదండ్రులే పిల్లలకు అన్ని విషయాలు దగ్గర ఉండి నేర్పించాలి. లేకపోతే వాళ్లు చెడు అలవాట్లకు బానిస అయ్యే అవకాశం ఉంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.