Dogs Cry: అర్ధరాత్రి కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? అరుస్తాయి?

రాత్రి సమయంలో ఒకరు వెళ్లినా, బైక్ ల మీద వెళ్లినా, కార్ లు అయినా సరే కుక్కలు భయపెట్టడం కామన్ కదా. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు అయిందా?. వెనుక నుంచి వెంబడిస్తూ.. కొరికేస్తూ.. వాహనదారులను వనికిస్తాయి.

Written By: Swathi Chilukuri, Updated On : September 27, 2024 10:52 am

Dogs Cry

Follow us on

Dogs Cry: కై.. కై.. కుయ్ కుయ్.. బౌ బౌ అంటూ పగటి పూట వినిపించిన శబ్ధాలు ఎక్కువగా రాత్రి వినిపిస్తూ ఉంటాయి. ఊరిలో అయితే ఈ శబ్ధాలు మరింత ఎక్కువ ఉంటాయి కదా. పిల్లలు రాత్రి బయటకు వెళ్లాలి అంటే భయపడతారు. ఆ రేంజ్ లో శబ్దాలు వస్తాయి. ఇక పిట్టలు, పిచుకల కూతలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఈ రేంజ్ లో శబ్దాలు ఎందుకు వస్తాయి. ఇంతకీ కుక్కలు ఎందుకు రాత్రి ఫుల్ గా మొరుగుతాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పగటిపూట శబ్ధం చేయని కుక్కలు సైతం రాత్రిపూట బండ్లు, వాహనాలు, పాదచారులు వెళ్తుంటే కూడా ఫుల్ గా అరుస్తూనే ఉంటాయి. మనుషుల రాకపోకలు ఉన్నా సరే లేకున్నా సరే వీటి అరుపులు మాత్రం కామన్ అన్నట్టుగా ఉంటుంది. మరి దీనికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాత్రి సమయంలో ఒకరు వెళ్లినా, బైక్ ల మీద వెళ్లినా, కార్ లు అయినా సరే కుక్కలు భయపెట్టడం కామన్ కదా. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు అయిందా?. వెనుక నుంచి వెంబడిస్తూ.. కొరికేస్తూ.. వాహనదారులను వనికిస్తాయి. పట్నం, పల్లె అనే తేడా లేకుండా వాటి ప్రతాపం చూపిస్తుంటాయి. ఉదయం ఉన్న బిహేవియర్ రాత్రి ఎందుకు కుక్కలకు ఉండదు అని చాలా సార్లు అనిపిస్తుంటుంది. పగటిపూట నిశ్శబ్దంగా ఉండే కుక్కలు కూడా రాత్రిపూట అందరినీ భయపెడుతుంటాయి. అయితే రద్దీ సమయాల్లో ఎక్కువ పట్టించుకోని కుక్కలు అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో హఠాత్తుగా అరవడం, మొరిగేలా చేయడం దాదాపు అందరూ గమనించే ఉంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కుక్కలు ఎక్కువగా అరిస్తే మెలుకువ వచ్చి భయం వేస్తుంటుంది కూడా.

వీధి కుక్కలు మాత్రమే కాదు పెంపుడు కుక్కలది కూడా ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు మీరు దయ్యాలు ఉన్నాయి, రాత్రి కుక్కలకు దయ్యాలు కనిపిస్తాయి అనుకుంటున్నారా? ఈ అపోహలు అన్నీ ఈ ఆర్టికల్ ద్వారా తొలిగిపోతాయి. కొందరు ఓ మెట్టు ఎక్కి కుక్క మొరిగితే చెడ్డ శకునం అని..లేదంటే రాబోయే మరణాన్ని సూచిస్తుందని నమ్ముతుంటారు. రీసెంట్ గా ఓ అధ్యయనం చేసి దీనికి మంచి సమాధానం చెప్పారు. అదేంటంటే?

జస్ట్ ఈ కుక్కలు తమ గుంపులోని ఇతర కుక్కలకు సంకేతంగా మొరుగుతుంటాయట. ఒక్కోసారి దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సురక్షితమైన ప్రదేశం కోసం కూడా ఇలాంటి శబ్దాలు చేస్తుంటాయట. అయితే కొన్ని వీధుల్లో వీధికుక్కలు తరచూ గొడవపడటం చూస్తుంటాం. అంతే కాకుండా అక్కడి వాతావరణం కుక్కలకు అనుకూలంగా లేకున్నా సరే అవి రాత్రి సమయంలో అరుస్తూనే ఉంటాయి. వాటికి ఏమైన బాధగా ఉంటే రాత్రి సమయంలో ఎక్కువగా అరుస్తుంటాయి. ఉదయం ఉండే రద్దీ వల్ల, జనాల వల్ల సగం భయంలోనే ఉండిపోతాయట కుక్కలు. ఇక రాత్రి సమయంలో వాటికి నొప్పి ఎక్కువగా అనిపించి మరింత ఎక్కువగా అరుస్తాయట. అంతేకాని దయ్యం కనిపించి అరుస్తుంది అనుకోవడం మీ అవివేకం అంటున్నారు కొందరు.

కొన్ని సార్లు కుక్క ఉన్న ప్రాంతం ఆ సరిహద్దు దానిది అని.. ఇతర కుక్కలు ఆధిపత్యం చెలాయించకూడదు అనే నేపథ్యంలో కూడా అరుస్తుంటాయట. ఇక వాతావరణంలో చిన్న చిన్న మార్పులను కూడా సులభంగా గ్రహిస్తాయి కాబట్టి కుక్కలకు మరింత శబ్దాలు ఎక్కువ వినిపిస్తాయి. సైరన్లు, వాహనాల హారన్లు, క్రాకర్లు, పార్టీలలో పెద్ద శబ్దాలు వంటివి మాత్రమే కాదు పర్యావరణ శబ్దాలు కూడా కుక్కలకు చిరాకుగా అనిపించి ఏదైనా అటాక్ చేస్తుంది కావచ్చు అనే నెపంలో అరుస్తుంటాయి అంటున్నారు నిపుణులు.