Moneyplant : మనీప్లాంట్ చెట్టు పెంచుతున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి..

పర్యావరణ ప్రేమికులు ఇళ్లల్లో మొక్కలు పెంచుకుంటున్నారు. వీటిలో మనీ ప్లాంట్ చెట్టు కచ్చితంగా ఉంటుంది. చాలా మంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ చెట్టు ఉండేలా చూసుకుంటున్నారు. మనీ ప్లాంట్ చెట్టు వల్ల ఆర్థికపరమైన లాభాలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే చెట్టును పెంచడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లు ఏవో? వాటికి పరిహారం ఏదో తెలుసుకోండి.

Written By: Srinivas, Updated On : September 27, 2024 4:17 pm

Moneyplant

Follow us on

Moneyplant : చెట్లు ప్రగతికి మెట్లు అని అంటుంటారు. ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉండడం వల్ల అక్కడున్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఒకప్పుడు పూలు, పండ్ల చెట్లు ఇంట్లో కచ్చితంగా పెంచుకునేవారు. ఇప్పుడు స్థలం లేకపోవడంతో చెట్లను పెంచడం వీలు కావడం లేదు. అంతేకాకుండా ఉన్న చెట్లను కూలేస్తున్నారు. అయితే కొందరు పర్యావరణ ప్రేమికులు ఇళ్లల్లో మొక్కలు పెంచుకుంటున్నారు. వీటిలో మనీ ప్లాంట్ చెట్టు కచ్చితంగా ఉంటుంది. చాలా మంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ చెట్టు ఉండేలా చూసుకుంటున్నారు. మనీ ప్లాంట్ చెట్టు వల్ల ఆర్థికపరమైన లాభాలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే చెట్టును పెంచడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లు ఏవో? వాటికి పరిహారం ఏదో తెలుసుకోండి..

మనీప్లాంట్ చెట్టను కొందరు ప్రధాన డోర్ పక్కన పెంచుకుంటారు. కానీ ఇలా పెంచడం అస్సలు మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే మనీ ప్లాంట్ చెట్టుతో ఆర్థికంగా లాభాలు ఉంటాయని అంటారు. అలాంటప్పపుడు ఆ చెట్టు బయటే ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనిని కచ్చితంగా ఇంట్లో మంచి ప్రదేశంలో ఉంచాలి. అలా వీలు కానప్పుడు టెర్రస్ పై ఎవరూ ముట్టని చోట ఉంచాలి. ఇలా పెట్టడం వల్ల అనుకున్న ఫలితాలు సాధిస్తారు.

మనీప్లాంట్ చెట్టు తీగ పారుతుంది. అయితే ఈ తీగ కిందకు పారుతున్నప్పుడు దానిని అలాగే వదిలేయవద్దు. దానిని పైకి కట్టేసుకోవాలి. ఈ తీగ పైకి వెళ్లడం ద్వారానే ఆ ఇంట్లో శుభాలు జరుగుతాయి. మనీప్లాంట్ చెట్టు ఒక్కోసారి ఎండిపోతుంది. కానీ దానిని అలాగే వదిలేస్తారు. ఇలా వదిలేయడం వల్ల ఇంట్లతో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మనీప్లాంట్ చెట్టు ఎండిన వెంటనే కొత్త మొక్కను నాటుకోవాలి. ఈ మొక్కకు మట్టి అవసరం లేకున్నా.. ఒక పాత్రలో నీరు పోసి ఉంచినా పెరుగుతుంది.

మనీ ప్లాంట్ చెట్టును ఎవరి వద్ద నుంచి తీసుకోవద్దు. అలాగే ఈ చెట్టును ఎవరికీ ఇవ్వొద్దు. సాధ్యమైనంత వరకు నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో పెరిగిన చెట్టు ఆ ఇంటికి సంబంధించిన నెగెటివ్ లేదా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. దీనిని ఎవరికైనా దానం ఇస్తే అశుభం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరుల వద్ద నుంచి తీసుకోవడం వల్ల వారి అశుభాలు మీకు వస్తాయి. అందువల్ల మనీప్లాంట్ ను డబ్బులిచ్చి తెచ్చుకోవాలి.

ఇంట్లో మనీ ప్లాంట్ ను ఉంచినప్పుడు సాధ్యమైనంత వరకు ఇంట్లో నైరుతి ప్రదేశంలో ఉంచాలి. అంతేకాకుండా ఎక్కువగా నడిచే ప్రాంతంలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మనీ ప్లాంట్ ప్రయోజనాలు కలగవు. మనీ ప్లాంట్ ప్రమోజనాలు కలగాలంటే దీనిని అపురూపంగా చూసుకోవాలి. లేదంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఆందోళనో ఉన్నవారు.. డబ్బు ఎక్కువగా నిల్వకుండా ఉన్న ఇళ్లల్లో మనీ ప్లాంట్ ను పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్ వల్ల ఆ ఇల్లు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అయితే ఈ ప్లాంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.