Parle-G Biscuit Packets: బిస్కెట్లు అంటే పిల్లలకు చాలా ఇష్టం. పిల్లలు మారం చేసినప్పుడు బిస్కెట్లు ఇచ్చి వారిని మచ్చిక చేసుకుంటారు. బిస్కెట్లలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో పార్లే-జీ, గుడ్ డే, సన్ ఫీట్స్ తదితర బ్రాండ్స్ ప్రాచుర్యం పొందాయి.

పార్లే-జీ బిస్కెట్లు ఎన్నో దశాబ్దాల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్. ఈ బిస్కెట్లకు పార్లే-జీ అనే పేరు ఎలా వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే ఆ బిస్కెట్ల ప్యాకెట్లపై ఉన్న చిన్నారి ఎవరు? పేరేంటి? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా..? ఈ బిస్కెట్ల మొట్టమొదటి ప్లాంట్ ముంబైలోని విలే పార్లే లో ప్రారంభమైంది. దీంతో ఈ బిస్కెట్లకు పార్లే-జీ అనే పేరు పెట్టారు. మరీ, జీ అంటే ఏంటి? అనే ప్రశ్న అందరిలో తలెత్తుంది. జీ అంటే గ్లూకోజ్ అని అర్ధం.
Also Read: ఆడపిల్లలకు ఉపద్రవం.. ఏంటీ కొత్త మార్పులు
పార్లే-జి బిస్కెట్లు…గ్లూకోజ్‌తో తయారు చేస్తున్నారు. పార్లే ఉత్పత్తులు 1929లో ప్రారంభమయ్యాయి. మొదట కేవలం 12 మంది సిబ్బంది మాత్రమే పని చేసేవారు. అయితే పార్లే-జీ బిస్కెట్లు తయారు చేసింది మాత్రం1938 నుంచి. ప్రారంభంలో ఈ బిస్కెట్‌కి ‘‘పార్లేజ్-గ్లూకో’’ అని పేరు పెట్టారు. మరో 4 దశాబ్దాల వరకు ఆ పేరు అలానే కొసాగింది. అయితే 80వ దశకం ప్రారంభంలో దీని పేరు మార్చారు. పార్లేజ్-గ్లూకోలో గ్లూకోను ‘G’గా మార్చారు. అప్పటి నుంచి ఈ బిస్కెట్లు మంచి ప్రాచుర్యం పొందడంతో తరువాత ‘G’ అనే పదాన్ని జీనియస్‌గా మార్చింది కంపెనీ. ప్రస్తుతానికి ‘పార్లే-జి’ గా కొనసాగుతుంది.
పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్‌పై ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది. అయితే ఆ చిన్నారి ఎవరు? పేరేంటి? అనే దానిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా మూడు పేర్లు నీరూ దేశ్‌పాండే, సుధా మూర్తి, గుంజన్ గుండానియా అనే ముగ్గురు వ్యక్తుల్లో ఎవరో ఒకరు వారి చిన్ననాటి ఫొటో అని అందరూ అంటుంటారు. అయితే వీరిలో ప్రముఖంగా నీరూ దేశ్‌పాండే పేరు బలంగా వినిపించింది. నీరూ దేశ్ పాండే… ఆమెకు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ ఫొటో తీశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ ఊహాగాలను తెరదించుతూ పార్లే-జీ కంపెనీ కీలక ప్రకటన చేసింది. పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్‌పై కనిపించే చిన్నారి ఫొటో ఎవరిది కాదని.. అది ఒక ఉదాహరణ మాత్రేమనని.. ఈ ఫొటోను ఎవరెస్ట్ క్రియేటివ్ ఏజెన్సీ తయారు చేసిందని కంపెనీ వెల్లడించింది.
Also Read: నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏంటో తెలుసా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?