Heart Attack:  నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏంటో తెలుసా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?

Heart Attack:  ఈ మధ్య కాలంలో తక్కువ వయస్సులోనే చాలామంది వేర్వేరు ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది గుండెపోటు వేగంగా వస్తుందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే గుండెపోటు చాలా సందర్భాల్లో నిదానంగా కూడా వస్తుంది. ఈ గుండెపోటును నిశ్శబ్ద గుండెపోటు అని పిలుస్తారు. గుండెకు రక్త ప్రసరణ సమయంలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే నిశ్శబ్ద గుండెపోటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. […]

  • Written By: Navya
  • Published On:
Heart Attack:  నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏంటో తెలుసా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?

Heart Attack:  ఈ మధ్య కాలంలో తక్కువ వయస్సులోనే చాలామంది వేర్వేరు ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది గుండెపోటు వేగంగా వస్తుందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే గుండెపోటు చాలా సందర్భాల్లో నిదానంగా కూడా వస్తుంది. ఈ గుండెపోటును నిశ్శబ్ద గుండెపోటు అని పిలుస్తారు.

Health tips in telugu: Heart Attack symptoms

Health tips in telugu: Heart Attack symptoms

గుండెకు రక్త ప్రసరణ సమయంలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే నిశ్శబ్ద గుండెపోటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఛాతీలో ఎప్పుడైనా అసౌకర్యం ఎదురైనట్టు అనిపిస్తే ఆ సమయంలో గుండె పరీక్షను చేయించుకుంటే మంచిది. జలుబు, చెమటలు, వికారం గుండె సంబంధిత లక్షణాలు కాగా ఫ్లూలో కూడా కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఫ్లూకు చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఈ సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

Also Read:  కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అతి తక్కువ వడ్డీకే ఆ సంస్థ రుణాలు!

అకస్మాత్తుగా మైకం, శ్వాస సంబంధిత సమస్యలు వేధిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నిశ్శబ్ద గుండెపోటుకు ఛాతీ నొప్పి కూడా కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఛాతీ నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం కొన్నిసార్లు గుండెపోటుకు ముందు ఎక్కువగా కనిపిస్తాయి. ఛాతీ మధ్యలో కొంచెం నొప్పి లేదా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్య చికిత్స చేయించుకుంటే మంచిది.

ఈ లక్షణాలు కనిపించిన సమయంలో సాధారణంగా చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అయితే నిర్లక్ష్యం చేసిన వాళ్లు తర్వాత ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. నిశ్శబ్ద గుండెపోటు లక్షణాల గురించి అవగాహన కలిగి ఉంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

Also Read:  సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?
Recommended Videos



Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు