Road Lines Marking : వాహనాలపై ప్రయాణాలు చేసేవారికి ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ముఖ్యగా 4 వీలర్ పై లాంగ్ జర్నీ చేసేవారు మస్ట్ గా అవగాహన ఉంచుకోవాలి. వాస్తవానికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముందు ట్రాఫింగ్ రూల్స్ గురించి ముందే చెబుతారు. కానీ ఈ సమయంలో కొందరు పట్టించుకోరు. ఈ తప్పిదం వల్ల భవిష్యత్ లో రోడ్ ట్రాన్స్ పోర్ట్ వారు చేసే కొన్ని నిబంధనలు అర్థం కావు. అయితే ఇప్పటికైనా రోడ్డుపై కొన్ని సిగ్నల్స్, గీతల గురించి అవగాహన కలిగి ఉండాలి. వీటిపై అవగాహన లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒకరికి అవగాహన లేకున్నా.. ఎదుటి వారికి నష్టాన్ని తెచ్చిన వారవుతారు. అందువల్ల ఈ నిబంధనలు తెలిసి ఉండాలి. అవేంటంటే?
రోడ్డుపై ..ముఖ్యంగా జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు కొన్ని తెల్ల గీతలు కనిపిస్తూ ఉంటాయి. కొర్ని చోట్ల కట్ అవుతూ ఉన్న లైన్స్ ఉంటాయి. మరికొన్ని ప్రదేశాల్లోల నాన్ స్టాప్ గా ఉంటాయి. ఇంకొన్ని చోట్ల ఎల్లో కలర్లో గీతలు కనిపిస్తాయి. వీటి గురించి తెలుసుకొని కొన్ని నిబంధనలు పాటించడం వల్ల ప్రయాణం సుఖవంతమవుతుంది. లేకపోతే గజిబిజిగా ప్రయాణం చేయడం వల్ల నష్టాల పాలవుతారు. అయితే ఈ గీతలు ఎందుకు ఉంటాయి? వాటికి అర్థం ఏంటీ? అనే వివరాల్లోకి వెళితే..
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రోడ్డు మధ్యలో కట్ అవుతూ ఉన్న వైట్ లైన్(బ్రోకెన్ లైన్) కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే.. ఇక్కడ ప్రయాణిస్తున్న వారు రోడ్డును క్రాస్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ముందు ఏదైనా వెహికల్ ఉంటే దానిని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లొచ్చు. అంటే ఈ లైన్ పై ప్రయాణించేవారు కాస్త స్లోగానే వస్తుంటారు.
రోడ్డుపై బ్రోకేన్ కాకుండా అంటే కట్ కాకుండా స్టేట్ గాలైన్ ఉంటుంది. ఈ లైన్ ఎక్కువగా జాతీయ రహదారులపైనే చూస్తుంటాం. ఈ లైన్ ఉన్నట్లయితే దానిని క్రాస్ చేయడానికి అవకాశం లేదు. మీరు లైన్ కు లోపల మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ లైన్ ఉంటే వాహనాలు స్పీడ్ గా వస్తుంటాయి. అంతేకాకుండా ఇవి టర్నింగ్ లో ఎక్కువగా కనిపిస్తాయి.
కొన్ని ప్రదేశాల్లో కంటిన్యూగా ఎల్లో లైన్ ఉంటుంది. ఇది ఎక్కువగా రోడ్ చిన్నగా ఉన్న ప్రదేశాల్లో వేస్తుంటారు. అయితే ఎల్లో లైన్ లోపల ముందు వాహనాన్ని ఓవర్ టెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
చివరగా కొన్ని రోడ్లపై డబుల్ ఎల్లో లైన్స్ ఉంటాయి. ఇవి కంటిన్యూగా ఉన్నట్లయితే ఈ లైన్ లోపల ప్రయాణించే వాహనాలు ముందు వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ టేక్ చేసేందుకు అవకాశం లేదు. ముందున్న వాహనం వెనుక మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.
రోడ్డుపై ప్రయాణించే వారు ఇలాంటి రూల్స్ ను తప్పకుండా తెలుసుకోవాలి. అంతేకాకుండా వీటిని పాటించడం వల్ల ప్రయాణించేవారు మాత్రమే కాకుండా ఎదుటివారికి కూడా ఎలాంటి నష్టం కలిగించకుండా ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజూ వేల మంది నిత్యం ప్రయాణాలు చేస్తుంటారు. కొందరు లాంగ్ జర్నీ చేస్తుండగా.. మరికొందరు వివిధ అవసరాల నిమిత్తం బయటకు వస్తారు.