IND vs BAN: బంగ్లాదేశ్ జట్టుతో సెప్టెంబర్ 19 నుంచి భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత మూడు టి20 లో సిరీస్ లో తలపడుతుంది. ఇప్పటివరకు భారత జట్టు యాజమాన్యం తొలి టెస్ట్ కు మాత్రమే జట్టును ప్రకటించింది. రోహిత్ నాయకత్వంలో 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇటీవల జట్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా రెండవ టెస్టు మొదలవుతుంది. అక్టోబర్ 6 నుంచి టి20 సిరీస్ షురూ అవుతుంది. ఈ మ్యాచ్లకు ఒకేసారి జట్టును ప్రకటిస్తామని బీసీసీ పెద్దలు చెబుతున్నారు.
అతడిని తప్పిస్తున్నారు
సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ మొదలు కాబోతున్న నేపథ్యంలో జట్టులో నుంచి గిల్ ను పక్కన పెట్టాలని బిసిసిఐ భావిస్తోంది.. న్యూజిలాండ్ తో త్వరలో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరిగే నేపథ్యంలో గిల్ కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు గిల్, బుమ్రా, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే రిషబ్ పంత్ కు కూడా రెస్ట్ ఇస్తారని తెలుస్తోంది. ఒకవేళ పంత్ కు విశ్రాంతి ఇస్తే మరో ఆటగాడు తిరిగి జట్టులోకి వస్తాడని తెలుస్తోంది..” బంగ్లాదేశ్ టోర్నీ మాకు అత్యంత ముఖ్యమైనది. కానీ దీనికంటే న్యూజిలాండ్ టోర్నీ చాలా విలువైనది. అందువల్లే స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నాం. అందులో గిల్ కూడా ఒకడు. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. బంగ్లాదేశ్ జట్టుతో టి20 సిరీస్ ముగిసిన మూడు రోజులకే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో గిల్ లాంటి ఆటగాడికి విశ్రాంతి చాలా అవసరమని” బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
వైస్ కెప్టెన్ గా..
గిల్ భారత వన్డే, టి20 జట్లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.. ఇక ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో అతడు ఇండియా ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి ఇన్నింగ్స్ లో 25, రెండవ ఇన్నింగ్స్ లో 21 పరుగులు చేశాడు. నిజానికి దులీప్ ట్రోఫీలో గిల్ అద్భుతంగా ఆడతాడని అందరూ భావించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని అనుకున్నారు. కానీ అతడు పూర్తిగా నిరాశపరిచాడు. కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. నిర్లక్ష్యమైన షాట్లు ఆడి… వాటికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు.