https://oktelugu.com/

Before dying : సూసైడ్ చేసుకునే ముందు.. వాళ్లలో కనిపించే లక్షణాలు ఇవే!

జీవితంలో బతకలేమని చనిపోతారు. కానీ వాళ్లకి చనిపోవడానికి ఉన్న ధైర్యం బతకడానికి మాత్రం ఉండదు. అయితే ఆత్మహత్య చేసుకునే వాళ్లలో కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తాయని కొందరు నిపుణులు అంటున్నారు. మరి ఆత్మహత్య చేసుకునే వాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈరోజు మన స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Bhaskar
  • , Updated On : September 15, 2024 1:16 pm
    Before dying

    Before dying

    Follow us on

    Before dying : చాలామంది వాళ్ల జీవితంలో అనుకున్నవి ఏమైనా కాకపోతే.. బాగా డిప్రెషన్ లోకి వెళ్తారు. అనుకున్నది ఒక్కటి కాదు.. ఇంకెందుకు బతికి ఉండటం అని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజుల్లో చాలామంది లైఫ్ లో సక్సెస్ కాలేదని, లవ్ బ్రేకప్ అయ్యిందని, పరీక్షలో పాస్ కాలేదని, ఎంటెక్ లో సీట్ రాలేదని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారు. ప్రస్తుతం అయితే చాలామంది ఇలాంటి కారణాలతో బాధపడుతూ చనిపోతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్లు ఒక్కసారిగా అలా చేసుకోరు. ఎన్నో రోజుల నుంచి మానసికంగా ఆవేదన చెందుతూ.. తట్టుకోలేక చనిపోతున్నారు. అన్నింటిలో ఫెయిల్.. ఇంకా జీవితంలో బతకలేమని చనిపోతారు. కానీ వాళ్లకి చనిపోవడానికి ఉన్న ధైర్యం బతకడానికి మాత్రం ఉండదు. అయితే ఆత్మహత్య చేసుకునే వాళ్లలో కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తాయని కొందరు నిపుణులు అంటున్నారు. మరి ఆత్మహత్య చేసుకునే వాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈరోజు మన స్టోరీలో తెలుసుకుందాం.

    జీవితం అనేది చాలా చిన్నది. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో కూడా ఎవరికి తెలియదు. ఉన్న ఒక్క లైఫ్ ని కూడా వాళ్లకి నచ్చినట్టు జీవించకుండా.. వ్యక్తిగత కారణాలు వల్ల చనిపోతుంటారు. అయితే చనిపోవాలి అనుకున్న వాళ్లు.. లైఫ్ లో మొత్తం ఓడిపోయాను. ఇంకా నేను బతికి ఉండడం వేస్ట్. నాకు చావే కరెక్ట్ అని ఫీల్ అయ్యి.. సూసైడ్ చేసుకుంటారు. ఇది ఒక్కసారిగా జరగదు. ఇలా రిపీటెడ్ గా అనుకున్నవన్నీ కాకపోయేసరికి చనిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్లు అందరితో తొందరగా కలవలేరు. ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్లలోనే వాళ్లు మాట్లాడుకుని బాధ పడుతుంటారు. చనిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లకి అన్నిటి మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఏ విషయం కూడా పెద్దగా పట్టించుకోరు. ఉదాహరణకి కుటుంబ సభ్యులు అంతా కలిసి సరదాగా మాట్లాడుతున్న సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్లు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. కొంతమంది అయితే కారణం లేకుండా కోపం అవుతుంటారు. ఈ ప్రపంచంలో నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని మనసులో మనో వేదన చెందుతుంటారు. ఇలా మన చుట్టూ ఎవరైనా ఉంటే వాళ్లని మనమే మార్చాలి. వాళ్లతో ఎక్కువగా సమయం గడపడం, ఏం చేస్తే సంతోషంగా ఉంటారో అలాంటి పనులు చేయాలి. వాళ్లని అసలు ఒంటరిగా వదలకూడదు. ఏదో విధంగా అందరితో కలిసి ఉండేలా చేయాలి. లేకపోతే వర్క్ లో బిజీ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాళ్లకు.. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన పెద్దగా రాదు. బ్రతకాలి అనే ఆలోచన మనం వాళ్లకు కలిపించాలి. అప్పుడే వాళ్లు ఆత్మహత్య అనే కాన్సెప్ట్ నుంచి బయటికి వస్తారు. జీవితం మీద ఆశ కలిగేలా వాళ్లతో ప్రవర్తించాలి. మరి మీకు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందా? అనిపిస్తే కారణం ఎందుకో కామెంట్ చేయండి.