https://oktelugu.com/

Vastu Tips: ఇంట్లో గుర్రాల బొమ్మను పెట్టారా? ఇవి పాటిస్తే అదృష్టం.. లేదంటే వినాశనం తప్పదట?

మీరు ఎప్పుడు తిరిగే గదిలో దీన్ని ఉంచాలి. ఎప్పుడు చూసే విధంగా ఈ చిత్ర పటాన్ని పెట్టుకోవాలి.. లివింగ్ రూమ్, స్టడీ రూమ్ లేదా వర్క్ ప్లేస్‌లో కూడా ఈ ఫోటోను పెట్టుకోవచ్చు. అయితే ఈ ఏడు గుర్రాల బొమ్మను ఇంటికి తూర్పు వైపున ఉంచాలట . కానీ దీన్ని మాత్రం బెడ్ రూమ్ లో ఉంచకండి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 27, 2024 / 01:37 PM IST

    Vastu Tips

    Follow us on

    Vastu Tips: వాస్తు శాస్త్రంలో 7వ సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంది. సప్తఋషి, ఇంద్రధనస్సు అంటూ ఏడును పవిత్రంగా భావిస్తారు. అదే విధంగా ఏడు కదిలే గుర్రాల చిత్రాన్ని కూడా గోడకు పెట్టాలి అంటారు నిపుణులు.. ఇంట్లో 7 తెల్ల గుర్రాల చిత్రాలను ఉంచడం చాలా మంచిదట. తెలుపు రంగు శాంతికి చిహ్నం. దీని వల్ల విజయం సాధిస్తారని.. అభివృద్ధి చెందుతారని నమ్ముతారు. ఈ చిత్ర పటం ఉండడం వల్ల ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉంటుందట. అయితే పరిగెత్తే గుర్రం వేగానికి గుర్తుగా భావిస్తారు.

    మీరు ఎప్పుడు తిరిగే గదిలో దీన్ని ఉంచాలి. ఎప్పుడు చూసే విధంగా ఈ చిత్ర పటాన్ని పెట్టుకోవాలి.. లివింగ్ రూమ్, స్టడీ రూమ్ లేదా వర్క్ ప్లేస్‌లో కూడా ఈ ఫోటోను పెట్టుకోవచ్చు. అయితే ఈ ఏడు గుర్రాల బొమ్మను ఇంటికి తూర్పు వైపున ఉంచాలట . కానీ దీన్ని మాత్రం బెడ్ రూమ్ లో ఉంచకండి.

    ఈ ఏడు గుర్రాల చిత్ర పటం పట్టుదల, విధేయత, బలం, విజయాన్ని సూచిస్తుంది. గుర్రం శక్తిని సూచిస్తుంది. దీని వల్ల మీరు జీవితంలో ముందుకు సాగుతారు. తూర్పుకు ఉంచుతూనే ఈ గుర్రం విగ్రహాన్ని దక్షిణాన కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు వాస్తు నిపుణులు. ఇక ఈ చిత్ర పటాన్ని ఉంచేటప్పుడు, ఏదైనా తలుపు లేదా కిటికీకి ఎదురుగా ఉండేలా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు కలిసి వస్తుంది.

    అయితే ఈ ఫోటోను తీసుకొని వచ్చే ముందు మాత్రం మీరు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మీరు తెచ్చే పటంలోని గుర్రానికి పగ్గాలు ఉండకూడదు . ఇది మీ జీవితంలో నెగిటివిటీ సూచిస్తుంది. పగ్గాలు లేని గుర్రం మాత్రమే శుభసూచకం. ఈ పటాన్ని ఇంటి ఉత్తర దిశలో ఉంచితే అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది అంటారు నిపుణులు.