Guess Actress: ఈ మధ్య ఒక ఫోటోను చూపించి గుర్తు పట్టండి అంటూ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని సెలబ్రెటీలు కూడా పోస్ట్ చేస్తుంటారు. అలాంటి ఒక ఫోటోను ఇప్పుడు మనం చూసేద్దాం. మీకు కనిపిస్తున్న ఈ ఫోటోలో ఉన్న చిన్నది ఎవరో గుర్తు పట్టారా? ఈ క్యూట్ పాప ఒకప్పటి అందాల నటి. 80-90s లలో తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మందిలో గూడు కట్టుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించింది.
అటు తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ల సరసన జతకట్టింది. ఇక మలయాళంలో కూడా మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది ఈ ఫోటోలోని బ్యూటీ. అన్ని ఇండస్ట్రీలో కూడా స్టార్లతోనే జతకట్టిందంటే అప్పుడు ఈమె రేంజ్ ఎలా ఉండేదో ఊహించుకోండి. పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు, అవార్డ్ విన్నింగ్ మూవీస్ లో నటించిన ఈమె 18 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతుందట. అది కూడా పాన్ ఇండియా స్టార్ హీరోతో పాన్ ఇండియా మూవీతో రాబోతుంది.
ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈ రోజు విడుదల అయిన విషయం తెలిసిందే. ఇందులో ఈ సీనియర్ నటి ఒక కీలక పాత్ర పోషించింది. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఆమె అలనాటి అందాల తార శోభన అని. కేవలం నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్ గా గుర్తింపు పొందింది ఈ సీనియర్ నటి. ఆమె కల్కి సినిమాలో మరియమ్ అనే పాత్రలో మెరిసింది. కొన్నిరోజుల క్రితమే సినిమాలో ఆమె లుక్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసినప్పుడు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
2006లో వచ్చిన మోహన్ బాబు, మంచు విష్ణుల సినిమాలో చివరి సారిగా నటించింది ఈమె. ఆ తర్వాత సినిమాలకు దూరమైన శోభన.. ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 18 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిచింది ఈ సీనియర్ నటి. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాలో ప్రభాస్ భైరవుడిగా కనిపించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రభాస్ తో జతకట్టింది. అమితాబ్, కమల్ హాసన్, మాళవిక నాయర్, దిశ పటానీ వంటి స్టార్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.