https://oktelugu.com/

Jagtial: నేను లోకల్ కాంగ్రెస్ నాయకుడిని.. మందులోకి స్టఫ్ ఉచితంగా ఇవ్వాల్సిందే..

జగిత్యాల జిల్లా కేంద్రం.. ఆ పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో.. మందు తాగేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు సామల్ల శేఖర్ వచ్చాడు. అక్కడ మద్యం తాగాడు. అనంతరం పర్మిట్ రూమ్ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 27, 2024 / 01:32 PM IST

    Jagtial

    Follow us on

    Jagtial: మద్యం తాగడం అనేది మంచి అలవాటు కాదు. కాకపోతే కొందరు మద్యానికి బానిసై.. దానిని తాగడం అస్సలు మానలేరు. పైగా మద్యం తాగిన మత్తులో ఏదేదో చేస్తూ ఉంటారు. విచక్షణ కోల్పోయి ఎదుటి వ్యక్తులపై దాడులకు పాల్పడుతుంటారు. అలాంటిదే ఈ సంఘటన కూడా. కాకపోతే ఈ సంఘటనలో పీకల దాకా మద్యం తాగిన ఓ మందు బాబు.. తనను తాను కాంగ్రెస్ నాయకుడినని చెప్పుకొని.. ఒక వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. అతడికి మరో వ్యక్తి వంత పాడి కత్తితో దాడి చేశాడు.

    అది జగిత్యాల జిల్లా కేంద్రం.. ఆ పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో.. మందు తాగేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు సామల్ల శేఖర్ వచ్చాడు. అక్కడ మద్యం తాగాడు. అనంతరం పర్మిట్ రూమ్ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళాడు.. స్టఫ్ తీసుకున్నాడు.. దానికి డబ్బులు ఇవ్వాలని పర్మిట్ రూమ్ నిర్వాహకుడు కోరడంతో శేఖర్ ఆగ్రహానికి గురయ్యాడు..” నేను లోకల్. నన్నే డబ్బులు అడుగుతావా.. నేను కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిని” అంటూ శేఖర్ ఆ పర్మిట్ రూమ్ నిర్వాహకుడి పై దాడి చేశాడు. శేఖర్ దాడి చేస్తున్న సమయంలో పుల్లయ్య అనే వ్యక్తి అతడికి సహకరించాడు. అంతేకాదు పక్కనే ఉన్న కత్తితో పర్మిట్ రూమ్ నిర్వాహకుడి పై దాడి చేశాడు.

    ఈ సంఘటన జగిత్యాల పట్టణంలో సంచలనం సృష్టించింది. పర్మిట్ రూమ్ నిర్వాహకుడి పై కత్తితో దాడికి పాల్పడిన పుల్లయ్య పై గతంలోనే ఓ హత్యాయత్నం కేసు నమోదయింది. తనపై అకారణంగా దాడికి పాల్పడిన శేఖర్, పుల్లయ్య పై పర్మిట్ రూమ్ నిర్వాహకుడు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పుల్లయ్య కత్తితో దాడి చేయడంతో పర్మిట్ రూమ్ నిర్వాహకుడి మెడ వద్ద గాయమైంది.. స్టఫ్ తీసుకొని, డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా, తాను లోకల్ అని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని చెప్పి.. అకారణంగా దాడి చేశారని పర్మిట్ రూమ్ నిర్వాహకుడు వాపోయాడు.