Coriander: కొత్తిమీర నెల రోజులు అయినా తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..

Coriander: ప్రతి సమస్యకు ఓ దారి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే లేదా అనుకుంటున్నారా? 15 రోజులు అయినా కొత్తిమీర బాగుండేలా టిప్స్ చూసేద్దాం..

Written By: Swathi Chilukuri, Updated On : June 3, 2024 5:21 pm

Do this to keep Coriander fresh for a month

Follow us on

Coriander: ఎంత బాగా కూర వండినా చివరకు కొత్తిమీర వేయకుంటే పెద్దగా రుచి రాదు. కూరలకు మంచి రుచిని అందిస్తుంది కొత్తిమీర. కానీ దీన్ని ఎక్కువ తీసుకొని వచ్చి పెడుతుంటే మాత్రం త్వరగా పాడు అవుతుంది. మరి ఎక్కువ రోజులు ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి సమస్యకు ఓ దారి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే లేదా అనుకుంటున్నారా? 15 రోజులు అయినా కొత్తిమీర బాగుండేలా టిప్స్ చూసేద్దాం..ఓ లుక్ వేసేయండి.

కొత్తిమీర కట్టలను వేర్లతో సహా కొనాలి. ఇక వచ్చాక ఆ వేర్లను కట్ చేయకుండా వాటిని అలానే ఉంచడం మంచిది. ముందుగా కొత్తిమీరను క్లీన్ చేసి ఆ తర్వాత ఆకులను క్లీన్ చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఓ గిన్నె, కాగితంలో వేసి మరీ ఆరనివ్వండి. కానీ వేర్లను మాత్రం కట్ చేయకండి. ఇలా ఆరిన తర్వాత గాలి చేరని గాజు కంటైనర్ లో పెట్టి స్టోర్ చేయాలి. నీరు ఉంటే కొత్తిమీర కుళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్త. ఈ కంటెయినర్‌లోని మిగతా భాగాల్లో నీరు పడకుండా అడుగున మాత్రమే పోయేలా నీటిని పైనుంచి పోయండి.

Also Read: Basil Plant: తులసి మొక్క ఏపుగా, పచ్చగా పెరగాలి అనుకుంటున్నారా? జస్ట్ సింపుల్ టిప్స్

ఎందుకంటే పైనున్న ఆకులపై నీరుపడితే త్వరగా కుళ్ళిపోతాయి కాబట్టి అడుగు భాగంలో కాస్త నీరు ఉంటే సరిపోతుంది. అంటే కొత్తిమీర వేర్లు మునిగేలా కొత్తిమీరని ఆ కంటెయినర్‌లో పెట్టండి. కొత్తిమీర ఆకులు జాడీలో వేసి మూతపెట్టండి. తర్వాత ఈ కంటెయినర్‌ని ఫ్రిజ్‌లో పెట్టండి. ఇలా కరెక్ట్‌గా చేస్తే నెల రోజుల పాటు కొత్తిమీర తాజాగా ఉంటుంది.

Also Read: Homemade Curd: తియ్యని గడ్డ పెరుగు కావాలా? ఇదిగో మంచి టిప్

మరి ఈ టిప్ మాత్రమే కాదు మరో పద్దతి ద్వారా కూడా కొత్తిమీరని ఎక్కువరోజులు స్టోర్ చేసుకోవచ్చు. కొత్తిమీరని ముందుగా బాగా కడిగాలి. ఆ తర్వాత మొత్తం ఆరబెట్టాలి. నీరు మొత్తం పోయాక.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన కొత్తిమీరని ఓ కంటెయినర్‌లో టిష్యూ పేపర్ వేసి దీన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్తి కొత్తిమీర రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది. అయితే పైన మరో టిష్యూ పేపర్ వేసి కంటెయినర్‌ని మూసివేయాలి. దీని వల్ల కొత్తిమీర తేమ లేకుండా తాజాగా చాలా రోజుల వరకూ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.