Basil Plant: తులసి మొక్క ఏపుగా, పచ్చగా పెరగాలి అనుకుంటున్నారా? జస్ట్ సింపుల్ టిప్స్

Basil Plant: ఇళ్లలో తులసి మొక్కలు చాలా ఏపుగా చక్కగా పెరిగి ఎంతో అందంగా కనిపిస్తుంటే.. మరికొన్ని ఇళ్ళలో తులసి మొక్కలు సరిగా పెరగవు. కొన్ని టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఏపుగా అందంగా పెరుగుతుంది.

Written By: Swathi, Updated On : June 3, 2024 4:03 pm

Do you want the basil plant to grow green

Follow us on

Basil Plant: భారతదేశంలో ప్రతి హిందువు ఇంట్లో తప్పనిసరిగా ఉండే మొక్క తులసి మొక్క. తులసిలో ఎందరో దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతుండడంతో ఈ మొక్కను దైవంగా కొలుస్తారు. ఇక కొన్ని ఇళ్లలో తులసి మొక్కలు చాలా ఏపుగా చక్కగా పెరిగి ఎంతో అందంగా కనిపిస్తుంటే.. మరికొన్ని ఇళ్ళలో తులసి మొక్కలు సరిగా పెరగవు. కొన్ని టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఏపుగా అందంగా పెరుగుతుంది.

నేల..
తులసి మొక్కకు ఎక్కువ నీరు పోయవద్దు. ఇలా చేయడం వల్ల మొక్క మూలాల్లో ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. ఎండిన మట్టిని తీసుకొని ఇందులో 50% తోట మట్టి, 20% ఇసుక, 10% వర్మీ కంపోస్ట్, 10 శాతం సేంద్రియ ఎరువులు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల తులసి వేర్లలో ఎక్కువగా నీరు నిలవదు.

పోషకాలు..
పోషకాల కొరత ఉంటే కూడా తులసి మొక్క ఎక్కువగా పెరగదు. కాబట్టి నేల pH స్థాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. దీంతో పాటు నేలకి పోషకాలను అందేలా చూసుకోవాలి. నేలకు పోషకాలు అందాలి అంటే.. ఎరువు, కొబ్బరి పీచు లేదా చెట్టు బెరడు ముక్కలు కలపితే సరిపోతుంది. సహజ ఎరువుగా, ఆవు పేడను ఎండబెట్టి పొడి రూపంలో తయారు చేసి తులసి మొక్క మట్టిలో కలపాలి.

Also Read: Homemade Curd: తియ్యని గడ్డ పెరుగు కావాలా? ఇదిగో మంచి టిప్

మట్టి కుండీ..
తులసి మొక్కను నాటడానికి మీడియం లేదా పెద్ద సైజు కుండి తీసుకోవాలి. కుండి కొద్దిగా లోతుగా, వెడల్పుగా ఉండేలా చూసుకోండి. కుండీ దిగువన రెండు పెద్ద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. కుండీలో రంధ్రాలు చేయడం చాలా అవసరం. దీని వల్ల నీరు లోపల నిలవకుండా బయటకు వెళ్తుంది. అదే కుండీలో ఒక కాగితాన్ని ఉంచి అందులో కంపోస్ట్ మట్టిని వేయవచ్చు.

విత్తనాలు / మొక్క..
మట్టి ఎరువు వేసాక విత్తనాలు ముఖ్యం. లేదా మొక్క ముఖ్యం. విత్తనాలను నాటడానికి ముందు మట్టిని పూర్తిగా వేసి..4 నుంచి 5 అంగుళాల లోతు వరకు మట్టిలో బాగా పాతాలి. లేదంటే చిన్న తులసి మొక్కలను వేర్లతో సహా సేకరించి వాటిని నాటుకున్న సరిపోతుంది. ఇలా నాటిన తరువాత నీరు పోయాలి.

Also Read: Children: ఈ అలవాట్లు మీ పిల్లలకు కచ్చితంగా నేర్పించండి

నీటి సరఫరా..
తులసి మొక్కకు చాలా తక్కువ నీరు అవసరం.వీలైనంత వరకు నేలను కాస్త పొడిగా లేదా తక్కువ తడిగా ఉండేలా చూసుకోవాలి. కానీ వేసవిలో, శీతాకాలంలో ప్రతి రోజు నీరు పోయడం ముఖ్యం. తులసి మొక్కపై షవర్ సహాయంతో తేలికపాటిగా నీరు పోయడం మరీ మంచిది.