Health Tips: చెమట పట్టడం మంచిదా? కాదా?

Health Tips: శరీరానికి చెమటలు పట్టడం అనేది ఆరోగ్యానికి చాలా విధాలా మేలే చేస్తుంది అంటున్నారు నిపుణులు. చెమటలు బాక్టీరియా పెరుగుదలను తగ్గించి.. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయట.

Written By: Swathi, Updated On : June 3, 2024 5:14 pm

Is sweating good for you

Follow us on

Health Tips: ఎవరికి అయినా సరే చెమటలు వస్తుంటాయి. కాస్త వేడి ఉన్నా కూడా కొందరికి చెమటలు(Sweating) వస్తాయి. కానీ రావడం అయితే పక్క. మరి ఈ చెమటలు రావడం మంచిదా కాదా? ఇంతకీ ఈ విషయంలో నిపుణులు ఏం అంటున్నారో ఓ సారి తెలుసుకుందాం.

శరీరానికి చెమటలు పట్టడం అనేది ఆరోగ్యానికి చాలా విధాలా మేలే చేస్తుంది అంటున్నారు నిపుణులు. చెమటలు బాక్టీరియా పెరుగుదలను తగ్గించి.. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయట. చెమట చర్మం pH ను తగ్గిస్తుందని, ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుందని తెలిపారు నిపుణులు. చెమట స్వేధ రంధ్రాలలో పేరుకుపోయిన అదనపు ధూళి, నూనె, మలినాలు వంటివి తొలగించడంలో సహాయం చేస్తుంది.. అలాగే చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది చెమట.

మొటిమలు(Pimples), మచ్చలు వంటి చర్మ సమస్యలు తలెత్తకుండా కూడా జాగ్రత్తపడవచ్చు. ఫలితంగా చర్మ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. చెమట ద్వారా శరీరంలోని అధిక ఉప్పు బయటికి వెళ్తుంది. దీని వల్ల ఎముకలకు సరిపడినంత కాల్షియం అందుతుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. చెమట వల్ల చర్మానికి రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది అంటున్నారు నిపుణులు. చెమట శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటూ.. శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్, తేమగా ఉంచుతుంది.

Also Read: Basil Plant: తులసి మొక్క ఏపుగా, పచ్చగా పెరగాలి అనుకుంటున్నారా? జస్ట్ సింపుల్ టిప్స్

చెమట పట్టడం మంచిదే కానీ.. అధికంగా చెమటలు పట్టడం మాత్రం ఆరోగ్యానికి హాని అంటున్నారు నిపుణులు. అధికంగా చెమటలు పట్టడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందట. వాతావరణంలోని దుమ్ము- ధూళి చెమటతో కలిస్తుంది. ఇది చర్మ రంధ్రాల్లోకి చేరి మొటిమలు, మచ్చలను ఏర్పడేలా చేస్తుంది. అలాగే.. చెమటలో ఉండే ఖనిజ లవణాలు, లాక్టిక్ యాసిడ్ కాలక్రమేణా సిరామైడ్లు, కొవ్వు ఆమ్లాలు, హైలురోనిక్ యాసిడ్ వంటి సహజ తేమ కారకాల స్థాయిలను తగ్గిస్తుంటుంది. దీని వల్ల చర్మం పొడిగా మారడం, చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయట.

Also Read: Homemade Curd: తియ్యని గడ్డ పెరుగు కావాలా? ఇదిగో మంచి టిప్

ఎక్కువ చెమట పడితే.. హైపర్ హైడ్రోసిస్ అని పిలుస్తారు. ఇది అథ్లెట్స్ ఫుట్, బాడీ దుర్వాసన, క్లామీ లేదా చెమటతో కూడిన అరచేతులు వంటి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందట. అందుకే అధికంగా చెమటలు పడుతుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.