https://oktelugu.com/

Shah Rukh Khan-Aamir Khan: షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ కాంబో లో భారీ మల్టీ స్టారర్ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Shah Rukh Khan-Aamir Khan: ఒకప్పుడు సౌత్ సినిమాలను చాలా తక్కువ అంచనా వేసి చూసిన బాలీవుడ్ హీరోలకి ఇప్పుడు మనవాళ్లు సరైన గుణపాఠం నేర్పిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : June 3, 2024 / 05:29 PM IST

    A huge multistarrer movie in Shah Rukh Khan Aamir Khan combo

    Follow us on

    Shah Rukh Khan-Aamir Khan: ప్రస్తుతం బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ సక్సెస్ లు ఏమీ లేవు. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాద్షాగా మంచి గుర్తింపును సంపాదించుకొని నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. మరి ఇప్పుడు అలాంటి షారుఖ్ ఖాన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అటెన్షన్ అయితే ఉండడం లేదు. మరి దానికి కారణం ఏంటి అంటే ఆయన ఎంచుకున్న కథలు, చేస్తున్న సినిమాలే కారణమని చాలామంది చెబుతున్నారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ డామినేషన్ ఎక్కువ అవ్వడంతో బాలీవుడ్ హీరోల హవా తగ్గింది.

    ఒకప్పుడు సౌత్ సినిమాలను చాలా తక్కువ అంచనా వేసి చూసిన బాలీవుడ్ హీరోలకి ఇప్పుడు మనవాళ్లు సరైన గుణపాఠం నేర్పిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఎలాగైనా సరే సౌత్ సినిమా ఇండస్ట్రీని డామినేట్ చేయాలనే ఉద్దేశ్యంలో బాలీవుడ్ హీరోలందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇద్దరు కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    Also Read: Rishab Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టి అందమైన ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..?

    ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయాలు కూడా ఇంకా అఫీషియల్ గా బయటికి రానప్పటికీ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), అమీర్ ఖాన్(Aamir Khan) ఈ మధ్య తరచుగా కలుసుకుంటూ వాళ్లు చేయబోయే సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

    Also Read: Vikramarkudu 2: విక్రమార్కుడు 2 సినిమాలో రవితేజ హీరోగా చేయడం లేదా..? మరి ఎవరు చేస్తున్నారు..?

    ఇక బాలీవుడ్ లో ఉన్న దిగ్గజ రైటర్ల చేత ఒక మంచి కథను కూడా రెడీ చేయిస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఈ సినిమా దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే బాలీవుడ్ హీరోలందరు మనవాళ్ళు సెట్ చేసిన ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసి వాళ్ళకంటూ సపరేట్ గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నారు. కానీ అది వాళ్ళ వల్ల కావడం లేదు మరి ఈ సినిమాతో అయిన వాళ్ళు కలలు కన్నా ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లోకి వస్తుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి…