Morning
Morning : కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త వ్యాధులు సంక్రమిస్తున్నాయి. కరోనా తర్వాత ప్రజల ఆరోగ్య జీవన శైలి మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆహార విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా కొన్ని కారణాలవల్ల అనుకొని వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య డయాబెటిస్ వ్యాధి విస్తృతమవుతోంది. కొందరికి వంశపారంపర్యంగా ఇది కొనసాగితే.. మరికొందరికి ఆహారపు అలవాట్లతో పాటు ఆరోగ్యం పై శ్రద్ధ వహించకపోవడంతో డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధిని గుర్తించడం ఎలా? ఎలాంటి లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్ వచ్చిందని అనుకోవాలి?
Also Read : స్మార్ట్ కు అలవాటు పడిన మనం.. మనదైన ఆనందాలు ఎన్ని కోల్పోతున్నామో తెలుసా..
డయాబెటిస్ వచ్చిందని తెలియడానికి ఎన్నో రకాల లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి నిలువలు పెరగడంతో డయాబెటిస్ వ్యాధి ప్రారంభమవుతుంది. అంటే మోతాదుకు మించిన ఆహారం తీసుకున్నా.. లేదా చక్కెర అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్న ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మోతాదుకు మించి ఆహారం లేదా చక్కెర నిల్వలు ఉన్న ఆహారం ఎక్కువ తీసుకున్నా.. శారీరక శ్రమ చేయడం వల్ల కాస్త కంట్రోల్లో ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలామంది శారీరక శ్రమ చేయడం లేదు. దీంతో కాలేయానికి అవసరానికి మించి చక్కెర రావడంతో తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరచూ మూత్రం రావడం అంటే డయాబెటిస్ లక్షణమే అని గుర్తుంచుకోవాలి. అయితే దీనిని అలాగే నిర్లక్ష్యం చేస్తే కిడ్నీపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
తినే ఆహారంలో చక్కెర నిల్వలు కచ్చితంగా ఉంటాయి. అయితే వీటిని జీర్ణం చేయడంలో ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. శరీరంలో ఆహారం జీర్ణమై గ్లూకోజ్ గా మారిన తర్వాత రక్తంలో కలుస్తుంది. శరీరానికి అవసరమయ్యే శక్తి కావాలంటే గ్లూకోజ్ తప్పనిసరి. అయితే ఈ గ్లూకోస్ సరిపడేంత ఉండాలి. కానీ కొందరు సరైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు.. సమయానికి ఆహారం తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో ఇన్సూరెన్స్ స్థాయిలు తగ్గుతాయి. అందువల్ల ఇన్సులిన్ లేకపోతే క్రోమా కందిలోని లాంగర్హన్స్ కుటికల్లో ఉండే బీటా కణాలు రక్తంలో ఉండిపోతాయి. ఇవి అలా ఉండి పోవడంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇవే కాకుండా రకరకాల ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో అనేక క్రియలు జరిగి డయాబెటిస్ వ్యాధి రావడానికి కారణమవుతాయి.
అయితే డయాబెటిస్ వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఉదయం లేచిన తర్వాత నీరసంగా ఉండడం.. లేదా తల తిరుగుతున్నట్లు కనిపించడం.. రాత్రి సమయంలో పదేపదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే షుగర్ టెస్ట్ చేసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఆ కారణంగా బరువు తగ్గడం.. చూపు మందగించడం వంటివి కూడా డయాబెటిస్ లక్షణాలు అని చెప్పవచ్చు. ఇక కొందరికి ఆకలి అతిగా వేయడం.. గాయాలు మానకపోవడం.. కాళ్లల్లో స్పర్శ తగ్గడం వంటి లక్షణాలను ఈ వ్యాధి ప్రారంభానికి కారణమని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : రోజు ఉదయం 7 గం.ల లోపు ఇలా చేయండి. మీ లైఫ్ మారిపోతుంది.