https://oktelugu.com/

Chicken : చికెన్ వారానికి ఎన్నిసార్లు తినాలి?

Chicken : చికెన్ అనగానే చాలామంది లొట్టలు వేసుకొని తింటూ ఉంటారు. చికెన్ తో చేసిన పదార్థాలు సైతం చాలా రుచిగా ఉంటాయి. మాంసాహారాల్లో తక్కువ ధరకు లభించే చికెన్ ను ఎక్కువమంది కొనుగోలు చేస్తూ ఉంటారు.

Written By: , Updated On : March 27, 2025 / 06:00 AM IST
Chicken

Chicken

Follow us on

Chicken : చికెన్ అనగానే చాలామంది లొట్టలు వేసుకొని తింటూ ఉంటారు. చికెన్ తో చేసిన పదార్థాలు సైతం చాలా రుచిగా ఉంటాయి. మాంసాహారాల్లో తక్కువ ధరకు లభించే చికెన్ ను ఎక్కువమంది కొనుగోలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దీనిని రెడీ చేయడానికి కూడా సులభంగా ఉండడంతో అందరూ చికెన్ కు సంబంధించిన పదార్థాలను తింటూ ఉంటారు. అయితే ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోవడంతో చాలామంది చికెన్ తినడం తక్కువ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య లేకపోవడంతో చికెన్ తినడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కొందరు తెలపడంతో ఎప్పటిలాగే చికెన్ను కొనుగోలు చేస్తున్నారు. అయితే బయట వాతావరణం తో సంబంధం లేకుండా సాధారణంగా కూడా చికెన్ ను తక్కువ తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చికెన్ ఎక్కువగా తింటే ఎలాంటి అనార్థాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..

పౌష్టికాహారం కోసం వారానికి ఒకసారి చికెన్ ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఏదైనా మోతాదుకు మించితే ప్రమాదమేనని వారు అంటున్నారు. చికెన్ లో ఉండే ప్రోటీన్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి. కానీ అదే పనిగా దీనిని తింటే అనేక రోగాలు వస్తాయని చెబుతున్నారు. చికెన్ లో ఎక్కువగా ఉష్ణోగ్రత కలిగించే పదార్థాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మనుషులకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇప్పటికే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉన్నవారు చికెన్ తినడం వల్ల మరింత వేడి శరీరానికి అంది తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఈ తలనొప్పి ఎక్కువసేపు ఉండి ఆ తర్వాత జ్వరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల తలనొప్పి ఉన్నవారు లేదా ఉష్ణోగ్రత అధికంగా ఉన్నవారు చికెన్ తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Also Read : ఆలసించినా ఆశా భంగం.. అక్కడ కిలో చికెన్ జస్ట్ ₹150 మాత్రమే.. త్వరపడండి..

వేసవి కాలంలో ఎండ తీవ్రతతో వాతావరణం వేడెక్కుతుంది. దీంతో మనుషులు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వేసవికాలంలో చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల మరింత ప్రమాదం ఉంటుంది. శరీరంలోని నీటిని పారదోలి నీరసం వచ్చే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరిగేవారు చికెన్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అంటున్నారు.

చికెన్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే అప్పటికే శరీరంలో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉన్నవారు దీనిని అదే పనిగా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఐ బీపీకి గురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే హై బీపీ ఉన్నవారు చికెన్ ఎక్కువగా తినడం వల్ల మరింత ప్రమాదం అని అంటున్నారు. వేసవికాలంలో చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల అతి సారా వ్యాధికి గురయ్య ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చికెన్ లో జీర్ణ క్రియను అడ్డుకునే పదార్థాలు ఉంటాయి. కొందరు దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడి ఆ తర్వాత కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల వారానికి ఒకటి లేదా రెండుసార్లు తప్పితే చికెన్ జోలికి పోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read : ‘గుడ్లు’ తేలేస్తున్న అమెరికన్లు.. గుడ్లు కొనాలంటే అమెరికాలో అష్టకష్టాలు.. అసలేమైందంటే?