https://oktelugu.com/

Chanakya Niti : చాణక్య నీతి: గౌరవం తగ్గకుండా క్షమాపణలు ఎలా చెప్పాలి?

Chanakya Niti : చాణక్యుడు మనుషుల జీవితాల గురించి అనేక విషయాలను సమాజానికి చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా మెదగాలి? ఇతరులతో ఎలా ఉండాలి?

Written By: , Updated On : March 27, 2025 / 04:00 AM IST
Chanakya Niti

Chanakya Niti

Follow us on

Chanakya Niti : చాణక్యుడు మనుషుల జీవితాల గురించి అనేక విషయాలను సమాజానికి చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా మెదగాలి? ఇతరులతో ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలపై అవగాహన కల్పించారు. వీటిని చాలామంది ఫాలో అవుతూ వస్తున్నారు. అయితే జీవితంలో తప్పు చేయని వారు అంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తప్పు చేస్తూనే ఉంటారు. కానీ ఆ తప్పును సరిదిద్దుకొని సక్రమమైన మార్గంలో నడిచిన వారే అసలైన వ్యక్తి అని చాలా సందర్భాల్లో ఇక్కడికి వింటూ ఉంటాం. అయితే ఒక్కసారి తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి ఆత్మగౌరవం ఒప్పుకోదు. కానీ ఎదుటి వ్యక్తికి క్షమాపణ చెప్పి ఆ వ్యక్తి మన్ననలను పొందాలని అనుకుంటారు. మరి ఇలాంటి సమయంలో గౌరవం తగ్గకుండా క్షమాపణలను ఎలా చెప్పాలి?

Also Read : భార్య గురించి ఈ విషయాలు ఇతరులకు చెప్పడం వల్ల.. ఎలాంటి అనర్ధాలు తెలుసా?

ఒక వ్యక్తి విషయంలో తప్పు చేసినప్పుడు.. ఆ వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు క్షమాపణలు అసలు చెప్పొద్దు. ఎందుకంటే కోపంలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి పాత విషయాలను తవ్వుతూ మరింతగా ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో క్షమాపణలు చెప్పినా ఎలాంటి ఫలితం ఉండదు. అందువల్ల ఆ వ్యక్తి కోపం పూర్తిగా తగ్గిన తర్వాత ప్రశాంతంగా ఉన్న సమయంలో క్షమాపణలు చెప్పాలి. అప్పుడే ఎదుటివారి ముందు గౌరవం తగ్గకుండా ఉంటుంది అని చాణక్య నీది తెలుపుతుంది.

ఎదుటివారికి క్షమాపణలు చెప్పే సమయంలో.. ఏదో చెబుతున్నాను కదా అని రెండు ముక్కలా సారీ అని చెబితే సరిపోదు. వారిని ఆకట్టుకునే విధంగా క్షమాపణ చెప్పాలి. అంటే మంచి మనసుతో పాటు విధేయతను కలిగిన భావాలతో క్షమాపణలు చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి రియలైజ్ అవుతాడు
దీంతో ఆ వ్యక్తి తప్పును క్షమించేస్తాడు. అప్పుడు ఎదుటి వ్యక్తి పై గౌరవం కూడా పెరుగుతుంది.

చాలామంది క్షమాపణలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొందరు క్షమాపణలు చెప్పిన వెంటనే క్షమించడానికి ఒప్పుకోరు. అయినా సరే వారు ప్రశాంతంగా మారిన తర్వాత మరోసారి క్షమాపణలు చెప్పే ఏర్పాటు చేయాలి. అలా రెండు మూడు సార్లు క్షమాపణలు చెప్పి వారి మనసును గెలుచుకోవడం ద్వారా వారితో స్నేహం కలకాలం ఉంటుంది. అందువల్ల ఆత్మగౌరవం తగ్గకుండా క్షమాపణలు చెప్పాలంటే కాస్త ఓపిక ఉండాలి.

కొందరు మాటల వల్ల ఎదుటివారు హర్ట్ అవుతారు. ఇలాంటి వారిని ఆకట్టుకోవడానికి క్షమాపణలు చెప్పడానికి ఆత్మగౌరవం ఒప్పుకోకపోతే.. ఆ వ్యక్తితో మంచి మాటలు చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా మంచి మాటలు చెప్పడం ద్వారా ఎదుటి వ్యక్తి క్షమించడానికి ముందుకు వస్తే అప్పుడు గౌరవం తగ్గకుండా వారిని ఆకట్టుకునే వారు అవుతారు. అయితే ఇది సాధ్యం కానీ సమయంలో వెంటనే క్షమాపణ చెప్పి వారి మనసును గెలుచుకోవాలి.

ఒక్కోసారి తప్పు చేయకపోయినా నేటి వ్యక్తికి క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఇలా చేయడం వల్ల క్షమాపణ చెప్పకుండా గౌరవాన్ని పొందుతారు.

Also Read : చాణక్య నీతి ఈ ఐదు రకాల బంధువులకు దూరంగా ఉండాలి..