
Wealthy Women : మన దేశంలో జ్యోతిష్యం మీద అందరికి నమ్మకం ఉంటుంది. మన దేహంలో కొన్ని అవయవాల గురించి ప్రత్యేకంగా చెబుతారు. పన్ను మీద పన్ను ఉంటే అదృష్టమని నమ్ముతారు. కొన్ని విషయాల్లో మనం మన పూర్వీకులను అనుసరిస్తాం. పురాణాల్లో కూడా అదృష్టం గురించి ఎన్నో రకాలు సూచిస్తారు. ఇంట్లో ఆడవారికి కొన్ని అవయవాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటితో మనకు అదృష్టం వరిస్తుందని అంటారు. అలాంటి అవయవాలు ఏంటో తెలుసుకుంటే మంచిదే.
మన శరీరంలో అన్ని అవయవాలు ఒకలా ఉండవు. జ్యోతిష్యం ప్రకారం మన శరీరంలో ఐదు భాగాలు పెద్దగా ఉంటే మనకు అదృష్టం కలిసొస్తుందని విశ్వసిస్తారు. ఇలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే మనకు అదృష్టం వరిస్తుంది. ఇలా స్త్రీల శరీర భాగాలు చూసి వారిని పెళ్లి చేసుకోవడం వల్ల మనకు అదృష్టం కలుగుతుందని నమ్మకం పెట్టుకుంటారు. ఇలాంటి ఆడవారిని తోడుగా చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మంచి స్థితికి చేరుకుంటారు.
పెద్ద చెవులు ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం జీవిస్తారు. అదృష్టం పొందుతారు. వివాహం చేసుకుని అత్తగారికి సంపద తీసుకొస్తుంది. ఇంకా పెద్ద జడ ఉన్న ఆడవారు అందంగా అదృష్టవంతులుగా ఉంటారు. వారికి పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉంటుంది. పొడవాటి జుట్టుతో ఉన్న స్త్రీలను అమ్మవారితో పోలుస్తారు. వారికి సమాజంలో గౌరవం ఇస్తారు. వారితో ఇంటికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పెద్ద పాదాలు ఉన్న స్త్రీ లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చూస్తారు.

ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు. సమస్యలను పరిష్కరించే శక్తి కలిగి ఉంటుంది. పొడవాటి చేతులు ఉన్న స్తీలకు మంచి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. జీవితంలో కష్ట సుఖాలను అనుభవిస్తారు. ఆమెకు మంచి భర్త లభిస్తాడు. పెద్ద నాభి ఉన్న స్త్రీ అదృష్టవంతులు. ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో డబ్బుకు లోటుండదు. జీవితంలో అనుకున్నది సాధిస్తారు. లక్ష్యం నెరవేర్చుకునేందుకు తాపత్రయపడతారు. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది.