Clean Toilet: ఇల్లు శుభ్రం చేయడమే పెద్ద టాస్క్ అంటే బాత్ రూమ్ శుభ్రం చేయడం దానికి మించిన టాస్క్. పోనీలే ఎందుకు శుభ్రం చేయడం అని అలా వదిలేస్తే రోగాలతో బెడ్ ఎక్కాల్సి వస్తుంది. టాయిలెట్స్ వల్ల ఎన్నో ప్రమాదమైన బాక్టీరియాలు రాజ్యమేలుతుంటాయి. దీని వల్ల రోగాలు వస్తుంటాయి. అందుకే టాయిలెట్ ను శుభ్రం చేయడం పక్కా. మరి వీటిని క్లీన్ చేయడానికి ఎన్ని లిక్విడ్ లను ఉపయోగించినా లాభం లేదా? చివరికి యాసిడ్ ను కూడా వాడారా? కానీ ఒక చిన్న టిప్ మీ టాయిలెట్ ను తెల్లగా మారుస్తుంది. అదేంటంటే..
ఫ్రిజ్ ఉందా? అందులో ఐస్ క్యూబ్స్ ఉన్నాయా? అయినా ఇప్పుడు ఎండాకాలం కచ్చితంగా ఉంటాయి లెండి. లేకపోయినా ఈ టాయిలెట్స్ కోసం పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లేకపోతే ఐస్ క్యూబ్స్ ను తెచ్చుకోండి. కానీ టాయిలెట్స్ లో ఒకసారి ట్రై చేయండి ఫలితం మీకే తెలుస్తోంది. ఇంతకీ వీటిని ఎలా యూస్ చేయాలి అనుకుంటున్నారా? ఐస్ క్యూబ్స్ ను టాయిలెట్ పాట్ లో పెడితే సరిపోతుంది. మంచు అదేనండి ఆ చల్లటి నీరు మచ్చలను తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
ఐస్ క్యూబ్స్ ను వాటిమీద పెట్టిన తర్వాత ఓ 30నిమిషాలు వెయిట్ చేయండి. ఈ సమయంలోనే ఐస్ కరిగిపోతుంది. దానితో పాటే పసుపు మచ్చలు మాయం అవుతాయి. ఇదంత పూర్తి అయినా తర్వాత కాస్త ఫ్లష్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల టాయిలెట్ పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. అంటే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదన్నమాట. అయితే ఐస్ క్యూబ్స్ కరుగుతున్న కొద్ది క్రమంగా మురికి కూడా తొలుగుతుంది. దీనికి పెద్దగా కష్టం చేయాల్సిన పని కూడా లేదు.
ఈ ఐస్ క్యూబ్స్ వల్ల తక్కువ సమయంలోనే తక్కువ శ్రమతోనే టాయిలెట్ ను శుభ్రం చేసుకోవచ్చు. ఇకనుంచి ఐస్ ను వృధా కాకుండా చూసుకోండి. దీని వల్ల ఖర్చు లేకుండా మీ టాయిలెట్ శుభ్రం అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఓసారి ట్రై చేసి చూడండి.