Chanakya Niti: మనుషులు చూసేందుకు బయటకు ఒకేలా కనిపించినా ఆలోచనా విధానంలో మాత్రం చాలా తేడా ఉంటుంది. కొందరిలో సద్గుణాలు ఉంటే, మరొకొందరిలో చెడు గుణాలు ఉంటాయి. ఒక మనిషి సన్మార్గంలో నడవాలన్నా, చెడు మార్గంలో నడవాలన్నా అతని మైండ్ సెట్, పెరిగిన వాతావరణం, మనతో ఉండే మిత్రుల ద్వారానే జరుగుతుంది.
అతను ప్రయోజకుడు అవుతాడా? లేదా జీవితాన్ని నాశనం చేసుకుంటాడా? అనేది కూడా డిసైడ్ అవుతుంది. బయట మనం చాలా మందిని చూసే ఉంటాం. కొందరు తమ లక్ష్యం కోసం పరిగెడుతుంటే మరికొందరు జల్సాలు చేస్తూ దుబారా ఖర్చులు పెట్టుకుంటూ తిరుగుతుంటారు. దీనంతటికీ చదువు, పేరెంట్స్ గైడెన్స్, వారిపై చిన్నతనం నుంచే నిరంతర పర్యవేక్షణ వలన మంచి బాటలో పయనిస్తుంటారు. లేకపోతే చెడు మార్గాలను ఎంచుకుంటుంటారు.
Also Read: చాణక్య నీతి ప్రకారం ఎవరి వైవాహిక జీవితాన్నయినా ఘోరంగా దెబ్బతీసే 6 విషయాలు. ఇది ముదిరితే విడాకులే!
చాణక్యుడు ఇటువంటి వారి కోసమే గొప్ప సూక్తులుతో పాటు పలు సూచనలు చేశాడు. వ్యక్తులు సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తిస్తే వారికి ఎటువంటి మర్యాద లభిస్తుంది. పది మందిలో ఉన్నా ఇతరులు నిన్ను ప్రత్యేకంగా గుర్తు ఎలా పెట్టుకోవాలంటే ఎం చేయాలో వివరించాడు. దీనినే చాణక్యుడి నీతి అని కొందరు చెప్పుకుంటుంటారు. మనిషికి ముఖ్యంగా జ్జాన సముపార్జన ఎంతో ముఖ్యమని చాణక్యుడు చెప్పారు. దీని వలన ఎక్కడికి వెళ్లినా బతికేయొచ్చని, మనతో ఉన్న వారిని రక్షించుకోగలుగుతామని చెప్పాడు. జీవతంలో జ్ఞానం ఎంత సంపాదించుకుంటే అంత ఎత్తుకు ఎదుగుతారని పేర్కొన్నాడు. మన దగ్గర ప్రతీది తరిగిపోతుందని, అన్ని నాశనం అవుతాయని, ఒక్క జ్ఞానాన్ని మాత్రమే ఎవరూ లాక్కోలేరని, నాశనం చేయలేరని స్పష్టం చేశాడు.
అంతేకాకుండా మనిషి తనకు చాలా నాలెడ్జ్ ఉందని అక్కడే ఆగిపోరాదని నిరంతరం ఏదో విషయం నేర్చుకుంటూ ఉండాలన్నారు. నేర్చుకోవడంతో పాటు సాధన కూడా అవసరమని, అప్పుడే అందులో శ్రేష్టులు అవుతారని, ఇతరులకు మార్గదర్శకులు కాగలరని వివరించాడు. పది మందిలో ఉన్నా నిన్ను ప్రత్యేకంగా గుర్తించే శక్తి జ్ఞానానికే ఉందని, దానికోసం ఎంత ఖర్చుచేసినా దానికి రెట్టింపు స్థాయి ధనాన్ని అది మనకు సంపాదించి పెడుతుందని తెలిపాడు. ఈ నియమాలను పాటించిన వారు జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా పరగిణింప బడతారని చాణక్య నీతి చెబుతోంది.
Also Read: జీవితం నాశనం కాకూడదు అంటే ఈ ముగ్గురు వ్యక్తులను దూరం పెట్టాలి.. చాణిక్య నీతి!