Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంపై వివాదం నానాటికీ ముదురుతోంది. చిత్ర పరిశ్రమలో ఒకరిద్దరూ మినహా టికెట్ టికెట్ ధరల తగ్గింపు విషయంపై ఎవరూ స్పందించకపోవడంతో వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏకంగా రంగంలోకి దిగారు. అసలు సినిమా పరిశ్రమ గురించి, హీరోల రెమ్యూనరేషన్ అంత ఎందుకిస్తారో మీకేం తెలుసు.. అని మొదలెట్టారు.
ఏపీ మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలకు ఏకంగా పదికి పైగా ప్రశ్నలు సంధించారు. మార్కెట్లో ఒక ఉత్పత్తికి ప్రభుత్వం ఎలా ధరను నిర్ణయిస్తుంది చెప్పాలన్నారు. అదే విధంగా ప్రైవేట్ సెక్టార్‌పై ప్రభుత్వ జోక్యానికి పరిధి ఏమిటి? ప్రభుత్వాలు ఎప్పుడు జోక్యం చేసుకోవాలి అనే ట్విట్టర్ ద్వారా ప్రశ్నల బాణాలు వదిలిన విషయం తెలిసిందే.
Also Read: రాంగోపాల్ వర్మను వదలని పేర్ని నాని.. దిమ్మదిరిగే కౌంటర్
రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వానికి ఎదురుతిరిగే ఒక్కరోజు ముందే ఇండస్ట్రీలో తాను పెద్దమనిషి పెత్తనం ఎత్తుకోవడానికి ఇష్టపడటం లేదని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మోహన్ బాబు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సవివరంగా లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు. తాజాగా ఆర్జీవీ కామెంట్స్‌కు మెగాబ్రదర్ నాగాబాబు మద్దతుగా నిలిచారు. మీరు సరైన ప్రశ్నలే అడిగారు. నా నోటి నుంచి రావాల్సినవి మీరు అడిగేశారంటూ చెప్పారు. అయితే, ఆర్జీవి ప్రశ్నలకు మంత్రుల నుంచి సరైన సమాధానం లేదు.
పేర్నినాని మాత్రం సైలెంట్‌గా ఉండిపోగా కొడాలి నాని మాత్రం పక్క రాష్ట్రంలో ఉండే ఆర్జీవీకి ఇక్కడి సమస్యల గురించి ఏం తెలుసు. అతన్ని మేము పట్టించుకోమని నిర్మోహమాటంగా చెప్పేశారు. తమ వైఖరి ఏంటో కూడా స్పష్టం చేశారు. కాగా, ఆర్జీవికి ఇప్పుడిప్పుడే సినీ పెద్దల మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఆర్జీవి కామెంట్స్ సరైనవే అని అంటుండగా.. మరికొందరు ఏపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా అస్సలు కనిపించడం లేదు. చివరకు ఏపీ ప్రభుత్వం దిగొస్తుందా? లేదా.. ఇది ఎక్కడికి దారి తీస్తుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: ఈ లక్షణాలు మీలో ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.. ఇతరలకు మార్గదర్శి కాగలరు..?