
Chanakya Niti Woman: ప్రతి మనిషి జీవితంలో వివాహం చేసుకోవడం సహజం. తోడుగా ఉండే మనిషి కోసం అందరు కలలు కంటుంటారు. తమ భాగస్వామి తన సంసారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుని తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకోవాలని అనుకుంటాడు. ఇందులో భాగంగా కాబోయే భార్య కోసం ఎన్నో రకాలుగా ఊహిస్తాడు. తన భార్య తనతో కలిసి రావాలని ఆశిస్తాడు. ప్రతి విషయంలో తనకు సహకరించాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఆచార్య చాణక్యుడు మనకు కాబోయే భార్యలో మంచి లక్షణాలు ఎలా ఉంటాయనే దానిపై స్పష్టత ఇచ్చాడు. నీ ఎదుగుదలలో నీకు ఉపయోగపడే స్త్రీ లక్షణాలు ఎలా ఉండాలనే దానిపై తనదైన శైలిలో వివరించాడు.
ధైర్యం గల స్త్రీ
చాణక్య నీతి ప్రకారం ధైర్యం గల స్త్రీ పురుషులకు అండగా నిలుస్తుంది. మనం చేసే పనిలో మనకు సహకరిస్తుంది. ఆపద సమయాల్లో మన వెంట నిలుస్తుంది. మహిళల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. స్త్రీల దైర్య సాహసాలు ఇంట్లో ఉండే వ్యక్తులకు కూడా సాయపడతాయి. దీంతో మనం జీవిత భాగస్వామిగా చేసుకునే మహిళ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలిన మనకు అనువైన లక్షణాలు ఉంటేనే వారిని వివాహం చేసుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సహనం గల మహిళ
అతిగా ఆవేశ పడే స్త్రీ అతిగా ఆశపడే మగాడు సుఖపడరని చెబుతారు. అలాగే స్త్రీలో సహనం ఎక్కువగా ఉండాలి. అందుకే వారిని భూదేవితో పోలుస్తారు. సహనంలో వారిది ప్రత్యేక శైలి. అన్ని సమయాల్లో ఆవేశానికి గురి కాకుండా ఉంటారు. ఆడవారికి సహనమే అలంకార భూషణం. దీంతో ఆడవారిలో మనం చూసేది సహనశీలతే. సహనం ఉన్న మహిళ ఏదైనా సాధిస్తుంది. అందుకు తగిన వనరులను కూడా సిద్ధం చేసుకుంటుంది. అందుకే మనకు కాబోయే జీవిత భాగస్వామి ఎంపికలో సహనం ప్రాధాన్యత వహిస్తుంది.
ధర్మాన్ని ఆచరించే స్త్రీ
ధర్మానికి పెద్దపీట వేసే స్త్రీని చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ధర్మాన్ని ఆచరించే మహిళ భర్తకు ఎంతో మేలు చేస్తుంది. సనాతన ధర్మాలను పాటించే స్త్రీలతో పురుషులకు కలిసివస్తుంది. వారు చేసే పూజలు, పునస్కారాల వల్ల ఆ ఇల్లు ఎదుగుతుంది. దేవుళ్లకు చేసే పూజలతో మన సంపదలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. మనిషి జీవితంలో స్త్రీలది కూడా ముఖ్య పాత్రే. అందుకే సరైన మహిళను చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. స్త్రీలు మనకు అన్నింట్లోనూ కలిసి వస్తే విజయాలు వస్తాయి.

పెద్దలన గౌరవించే..
పెద్దలను గౌరవించే స్త్రీని వివాహం చేసుకుంటే మంచిది. పెద్దవారి పట్ల గౌరవం లేని లేని వారిని ఎవరు క్షమించరు. పెద్దవారిని గౌరవించే స్త్రీలను అందరు ఇష్టపడతారు. ఇంట్లో ఆనందాలు విలసిల్లాలంటే పెద్దలను ఎప్పుడు గౌరవిస్తుండాలి. అలాంటి వారిని చేసుకుంటేనే ఉత్తమం. ప్రేమగా మాట్లాడేవారిని ఆదరిస్తారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలంటే స్త్రీల వల్లే సాధ్యమవుతుంది. చాణక్యుడు సూచించిన ప్రకారం ప్రతి వ్యక్తి తనకు కాబోయే జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి మంచి వారిని చేసుకోవడానికే మొగ్గు చూపితే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది.