https://oktelugu.com/

Chanakya Niti: ఒక వ్యక్తిని నమ్మే ముందు అతనిలో పరిశీలించాల్సిన లక్షణాలు ఇవే.. చాణిక్య నీతి!

Chanakya Niti: చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఒక మనిషి జీవితంలో ఎలా ముందుకు సాగాలి..వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఏ వ్యక్తులతో పరిచయం చేసుకోవాలి ఎరిని దూరం పెట్టాలి అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. ఇలా చాణక్యుడు.తన నీతి గ్రంథం ద్వారా ఒక మనిషిని నమ్మే ముందు తప్పనిసరిగా అతనిలో కొన్ని లక్షణాలను పరిశీలించాలని తెలిపారు. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం… […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 28, 2022 / 10:13 AM IST
    Follow us on

    Chanakya Niti: చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఒక మనిషి జీవితంలో ఎలా ముందుకు సాగాలి..వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఏ వ్యక్తులతో పరిచయం చేసుకోవాలి ఎరిని దూరం పెట్టాలి అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. ఇలా చాణక్యుడు.తన నీతి గ్రంథం ద్వారా ఒక మనిషిని నమ్మే ముందు తప్పనిసరిగా అతనిలో కొన్ని లక్షణాలను పరిశీలించాలని తెలిపారు. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

    Chanakya Niti

    త్యాగ స్ఫూర్తిని గుర్తించండి: మనం ఒక వ్యక్తిని నమ్మాలని భావించినప్పుడు అతనిలో త్యాగగుణం ఎంతవరకు ఉందో గుర్తించాలి.ఇతరుల కోసం ఆ వ్యక్తి తన ఆనందాన్ని త్యాగం చేసి నప్పుడు ఇతరుల బాధను పంచుకోవడంలో కూడా ముందుంటారు. అలా త్యాగగుణం కలిగిన వ్యక్తిని మాత్రమే మనం నమ్మదగిన వ్యక్తిగా పరిగణించవచ్చు.

    చరిత్ర: ఒక వ్యక్తిని నమ్మే టప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి చరిత్రను కూడా తెలుసుకోవాలి. అతను ఏ విధమైనటువంటి వ్యక్తి, అతని గత చరిత్ర ఏమిటి అనే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.వారి గతంలో వారి వ్యక్తిత్వం సరిగాలేదని తెలిసినప్పుడు అలాంటి వారితో పరిచయం ఏర్పరుచుకోవడం అలాంటి వారిని నమ్మడం పూర్తిగా మోసపోయినట్లేనని చాణిక్యుడు తెలిపారు.

    Also Read: శివుడికి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయడం వల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయో తెలుసా?

    లక్షణాలు పరిశీలించడం: మనం ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ముందుగా అతనిలో లోపాలు అతని గుణగణాలు కోపం సోమరితనం అబద్ధాలు చెప్పే వంటి లక్షణాలు అలవాటు ఉన్న వారిని ఎప్పుడూ నమ్మకూడదు. సత్యాలను మాత్రమే మాట్లాడే వారు అని మనం తెలుసుకున్నప్పుడే వారితో పరిచయం ఏర్పరుచుకోవాలి.

    కర్మ: ఎవరైతే సరైన మార్గంలో డబ్బు సంపాదించి ఆ డబ్బును దానధర్మాలు సహాయ సహకారాలు చేయడం కోసం ఉపయోగిస్తారో అలాంటి వారిని మాత్రమే నమ్మాలి. అలా కాకుండా అసత్య మార్గంలో ప్రయాణం చేస్తూ.. డబ్బులు సంపాదించే వారు ఆ డబ్బుతో దానం చేసే వారిని నమ్మకూడదని చాణిక్యుడు నీతి గ్రంథం ద్వారా తెలిపారు.

    Also Read: తాంబూలంగా తమలపాకులు మాత్రమే ఇవ్వడానికి గల కారణం ఏమిటో తెలుసా?