Powergrid Jobs: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను ఈ సంస్థ విడుదల చేసింది. మొత్తం 105 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
అసిస్టెంట్ ఇంజినీర్ ట్రయినీ ఉద్యోగ ఖాళీలలో కంప్యూటర్ సైన్స్ ఉద్యోగ ఖాళీలు 37, ఎలక్ట్రికల్ 60, సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 4, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి. ట్రైనింగ్ పీరియడ్ లో పవర్ గ్రిడ్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 40,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ట్రైనింగ్ పూర్తైన తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా 50,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.
Also Read: పదో తరగతి అర్హతతో 1501 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. 2021 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ అభ్యర్ధులు ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: విశాఖలో 31 ఉద్యోగ ఖాళీలు.. రూ.90 వేలకు పైగా వేతనంతో?