https://oktelugu.com/

Karthika Deepam January 28 Episode: గుండె నొప్పితో సౌర్య.. ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో డాక్టర్ బాబు!

Karthika Deepam January 28 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. కార్తీక్.. మమ్మీ, డాడీ వాళ్లను చూశానని దీపతో చెప్పి బాధ పడతాడు. కానీ ఈ విషయం నీకు చెప్పలేదని అంటాడు. దాంతో దీప కూడా నేను కూడా అత్తయ్య మామయ్య వాళ్ళ ని చూశానని అంటుంది. కానీ చెప్పే పరిస్థితి కాదని అందుకే చెప్పలేదని అంటుంది. ఇక పిల్లలు ఉదయాన్నే లేచి స్కిప్పింగ్ ఆడాలని అనుకుంటారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 28, 2022 / 10:16 AM IST
    Follow us on

    Karthika Deepam January 28 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. కార్తీక్.. మమ్మీ, డాడీ వాళ్లను చూశానని దీపతో చెప్పి బాధ పడతాడు. కానీ ఈ విషయం నీకు చెప్పలేదని అంటాడు. దాంతో దీప కూడా నేను కూడా అత్తయ్య మామయ్య వాళ్ళ ని చూశానని అంటుంది. కానీ చెప్పే పరిస్థితి కాదని అందుకే చెప్పలేదని అంటుంది. ఇక పిల్లలు ఉదయాన్నే లేచి స్కిప్పింగ్ ఆడాలని అనుకుంటారు.

    Karthika Deepam January 28 Episode

    తాడు కోసం కాసేపు తంటాలు పడుతూ ఉంటారు. కార్తీక్ వారి దగ్గరికి వచ్చి ఏం కావాలని అడగడంతో.. వెంటనే వారికి తాడు తీసుకొని వస్తాడు. ఇక సౌర్య స్కిప్పింగ్ ఆడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఆగుతూ ఉండగా హిమ కాసేపు ఆగనంటుంది. కానీ అంతలోనే సౌర్య కింద పడుతుంది. కార్తీక్ వెంటనే తనని మీద పడుకోబెట్టుకుని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు చేసిన గుండె ఆపరేషన్ మళ్లీ ఏదైనా సమస్య తీసుకు వచ్చిందేమో అని బాధ పడతాడు.

    Also Read: బెడ్‌ పై నుంచి లేవలేని స్థితిలో స్టార్ సింగర్ !

    వెంటనే డబ్బుల కోసం బయలు దేరుతాడు. ఎలాగైనా మమ్మీ వాళ్ళు డబ్బులు అడగాలి అని అనుకుంటాడు. ఇక ఆకాశం వైపు చూస్తూ ఎందుకు దేవుడా ఇలా చేశావు అంటూ గట్టిగా అరుస్తాడు. మరోవైపు దేవయాని తన మనుషులతో కార్తీక్ ను తీసుకొని రమ్మంటుంది. ఇక కార్తీక్ ఆశ్రమం దగ్గరికి వెళ్లగా అక్కడ ఉన్న ఆశ్రమం వ్యక్తికి సౌందర్య వాళ్ళు తన తల్లిదండ్రులు అని చెప్పి వాళ్ళను పిలవమని బ్రతిమాలుతాడు.

    కానీ ఆ వ్యక్తి కార్తీక్ మాటలను వినిపించుకోకుండా సౌందర్య వాళ్ళ గురించి చెప్పడానికి నిరాకరిస్తాడు. ఇక కార్తీక్ బాధపడుతూ వెనుకకు వెళ్తాడు. డాక్టర్ అయ్యుండి కూడా తన కూతురికి ఆపరేషన్ చేయలేని పరిస్థితి అని బాధ పడతాడు. తరువాయి భాగం లో కార్తీక్ ను రుద్రాణి మనుషులు ఎదురు పడతారు. మరోవైపు దీప కార్తీక్ కోసం ఎదురు చూస్తూ బాగా ఏడుస్తుంది.

    Also Read: క్షమాపణలు చెప్పిన ‘మ్యాంగో వీడియోస్’