Homeలైఫ్ స్టైల్Chanakya Neeti : జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ విషయాలను కచ్చితంగా పాటించాలి..

Chanakya Neeti : జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ విషయాలను కచ్చితంగా పాటించాలి..

Chanakya Neeti : జీవితంలో సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే గమ్యాన్ని చేరుకోవడం అందరికీ సాధ్యం కాదు. కొంత మంది తమకు అదృష్టం లేదని.. డబ్బు లేదని.. అవకాశాలు లేవని… పలు కారణాలు చెబుతూ ఉంటారు. కానీ లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకునేవారు పక్క చూపులు చూడరు. గురిపై మాత్రమే దృష్టి పెడుతారు. అంతేకాకుండా ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లడం వల్ల విజయాలను సాధిస్తారు. అయితే చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం ఒక వ్యక్తి తనకు ఉన్న అలవాట్లు, ప్రవర్తన కారణంగా కూడా విజయం అంచుల వరకు చేరలేడు అని చెప్పాడు. ఆవేంటంటే?

చాణక్యుడు రాజనీతి సూత్రాలను మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించిన విలువైన సూత్రాలను ప్రజలకు అందించాడు. వాటిని పాటిస్తున్న చాలా మంది తమ జీవితాలను సస్యశ్యామలం చేసుకున్నారు. చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలు జీవితంలో పైకి ఎదగడానికి ఎంతో తోడ్పడుతాయి. వీటిలో వ్యసనాలు ఒకటి. ఒక వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం ఏది చేసిన వ్యసన బారిన పడితే మాత్రం అస్సలు ముందుకు వెళ్లలేడు. తాను సంపాదించిన డబ్బంతా వ్యసనాలకే ఖర్చు అవుతుంది. దీంతో కావాల్సిన డబ్బు అందుబాటులో లేకకపోవడంతో అనేక సమస్యలు ఎదుక్కొంటాడు.

ప్రతీ వ్యక్తికి స్నేహం చాలా ముఖ్యం. కానీ మంచి స్నేహితుడు మాత్రమే ఆ వ్యక్తి బాగోగులు కోరుకుంటాడు. కొందరు స్వార్థం తో ఉండే వారు మంచిగా నటిస్తూనే నష్టాన్ని చేకూరుస్తారు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది. ఇలాంటి వారు స్నేహం చేయడానికి ముందుకు వచ్చినా వారిని కలవడానికి అస్సలు ప్రయత్నించొద్దు. అంతేకాకుండా జీవిత లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నప్పుడు కొన్ని స్నేహాలకు దూరంగా ఉండాలి.

నిజాయితీ జీవితాన్ని చక్కబెడతుంది. అందువల్ల తాత్కాలిక ఆనందాల కోసం ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడం మంచిది.కొన్ని చిన్న తప్పులే అయినా జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వీటి వల్ల జీవితం నాశనం అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు తప్పులకు దూరంగా ఉండడం మంచింది. ఒకవేళ తప్పు చేసినా దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.

కొందరు తమ గొప్పలకు తరుచూ అబద్దాలు ఆడుతూ ఉంటారు. ఇవి కొన్ని సమస్యలకు పరిష్కారం అయినా శాశ్వతంగా మాత్రం నష్టాలను చేకూరుస్తాయని గ్రహించాలి. తరుచూ అబద్దాలు చెప్పేవారిని బయటి వారు మాత్రమే కాదు.. ఇంట్లో వారు కూడా నమ్మరు. అందువల్ల అబద్దాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. నిజాలు చెప్పే వారితో ఎక్కువ మంది స్నేహం చేయడానికి ముందుకువ వస్తుంటారు. అంతేకాకుండా సమాజంలో నిజాలు చెప్పే వారికి విలువ ఎక్కువగా ఉంటుంది.

కష్టపడంది ఏదీరాదు.. కష్టపడకుండా వచ్చింది ఎంతో కాలం నిలవదు. ఇది సినిమాలో డైలాగ్ అయినా.. నిజ జీవితంలో జరిగేదే. కష్టపడకుండా సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. కష్టపడి పనిచేసిన తరువాత పొందే విజయం ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. అంతేకాకుండా ఇది శాశ్వతంగా ఉంటుంది. ఏ రంగంలో వారైనా కష్టపడి సంపాదించడానికి మాత్రమే ప్రయత్నించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
Exit mobile version