https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించని లాభాలు..

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ అవసరాలకు తగినంత డబ్బును కూడబెట్టుకుంటారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 26, 2024 / 07:59 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సర్వార్థ సిద్ధియోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అధికల లాభాలు వస్తాయి. మరికొందరు ప్రతికూల ఫలితాలు పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ అవసరాలకు తగినంత డబ్బును కూడబెట్టుకుంటారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు.

    వృషభ రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడుతాయి. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.

    మిథున రాశి:
    ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటారు. ఉద్యోగులు మాత్రం మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వాగ్వాదానికి దూరంగా ఉండండి.

    కర్కాటక రాశి:
    వ్యాపారులు అధిక ఆదాయం పొందుతారు. ఉద్యోగులు కొత్త మార్గాలను ఎంచుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి.

    సింహారాశి:
    పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారుల పాత పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు.

    కన్య రాశి:
    ఉద్యోగులు కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యక్తిగత పనులు పూర్తి చేసుకుంటారు. బందువులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

    తుల రాశి:
    వ్యాపారంలో పోటీ ఏర్పడుతుంది. దీంతో ఆదాయం రావడంలో సమస్యలు ఏర్పడుతాయి. అత్యవసర పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది.

    వృశ్చిక రాశి:
    మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఉత్సాహం చూపుతారు.

    ధనస్సు రాశి:
    పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకొని పెట్టే పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

    మకర రాశి:
    బంధువులతో మెరుగైన సంబంధాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

    కుంభరాశి:
    కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాాలి. పెట్టుబడుల విషయంలో ఇతరుల సాయం తీసుకుంటారు.

    మీనరాశి:
    వ్యాపార పర్యటనలు వాయిదా పడుతాయి. పెట్టుబడులపై లాభాలు వస్తాయి. కుటుంబజీవితం సంతోషంగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.