Relationship : పెళ్లీ అనేది జీవితంలో ప్రధానమైన ఘట్టం. ఒక వ్యక్తికి రెండు జీవితాలు ఉంటే పెళ్లయిన తరువాత ఉండేది రెండో జీవితం. పెళ్లయిన తరువాత చాలా మంది కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లే. కొత్త వ్యక్తితో కలిసి ఉండడం.. కుటుంబాన్ని పోషించడం వంటి బాధ్యతలు ఉంటాయి. దీంతో కష్టాలు, నష్టాలు, ఆనందాలు ఇలా అన్నీ రకాలుగా ఉంటుంది. అయితే చాలా మంది పెళ్లయిన తరువాత తమ జీవితం బాగుండాని ముందే ప్లానింగ్ వేసుకుంటారు. ఇందుకోసం సరైన వ్యక్తిని ఎంచుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా ఒక అమ్మాయి తాను పుట్టిన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్లాలి కాబట్టి తన భర్త మంచోడు అయి ఉండాలని కోరుకుంటుంది. అయితే నేటి కాలంలో అమ్మాయిలు తనకంటే తన భర్త వయసు ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారట. ఇలా కోరుకోవడానికి కారణమేంటి? వయసు ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది?
భార్యభర్తల మధ్య వయసు తేడా భారీగా ఉండొద్దని కొందరు అనుకుంటారు. పూర్వ కాలంలో వయసు తేడా ఎక్కువగా ఉన్నవారి పెళ్లిళ్లు చేసేవారు. ఎందుకంటే భర్త వయసు పెద్దదిగా ఉండడం వల్ల కుటుంబ బాధ్యతలు తెలిసి ఉండాయని నమ్మేవారు. కానీ ఆ తరువాత ప్రేమ పెళ్లిళ్లు జరగడంతో ఇద్దరు సమాన వయసును చూసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చాలా మంది అమ్మాయిలు తమ కంటే ఎక్కువ వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇలా చేసుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని భావిస్తున్నారు.
వయసు ఎక్కువగా ఉన్న భర్తకు కుటుంబ పరిస్థితులపై అవగాహన ఉంటుంది. దీంతో ఇంట్లో ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి వెనుకాడరు. అంతేకాకుడా కొన్ని పనులు చేయడానికి ఇబ్బందులు పడరు. ముఖ్యంగా భార్యకు సహకరించాలనే సద్గుణం ఉంటుంది. ఏ విషయాన్నైయినా అర్థం చేసుకోగలుగుతారు. తనకున్న అనుభవం ద్వారా భార్య కొన్ని విషయాలను నేర్చుకొని కొన్ని సమస్యల పట్ల సానుకూలంగా ఉంటుంది.
కొందరు అబ్బాయిలు కమిట్మెంట్ తో ఉంటారు. పెళ్లి చేసుకున్నాక బాధ్యతతో వ్యవహరిస్తారు. 30 ప్లస్ అబ్బాయిలు ఎలాంటి చిరుతిరుగుళ్ల జోలికి వెళ్లకుండా సంసారంపై దృష్టి పెడుతారు. స్నేహితులకు దూరంగా ఉంటారు. కొన్ని వ్యసనాలు సైతం దూరం పెడుతారు. ఇలాంటి వారి ని పెళ్లి చేసుకోవడం వల్ల వారితో జీవితం ఆనందంగా ఉంటుందని అమ్మాయిలు భావిస్తున్నారు.
అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండడం వల్ల శృంగార జీవితం కూడా హ్యాపీగా ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి వారికి లైంగిక జీవితంపై పూర్తిగా అవగాహన ఉంటుంది. దీంతో భార్యను సంతోషంగా చూసుకోవడంతో పాటు కావాల్సిన ఆనందాలను ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇదే సమయంలో వారు ఇతరుల కంటే భార్యపైనే ఎక్కువగా ప్రేమ చూపుతారట.
అమ్మాయి, అబ్బాయి ఏజ్ సమానంగా ఉండడం వల్ల ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే తేడా ఉంటే ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించాలని అనుకోరు. పైగా వయసు పెద్దగా ఉన్న అబ్బాయిలు తమ భాగస్వాములపై పెత్తనం చెలాయించాలని పెద్దగా కోరుకోరు. దీంతో అమ్మాయిలు తమ ఇష్టానికి అనుగుణంగా ఉండొచ్చని భావిస్తున్నారు.