Career tips: ప్రతి వ్యక్తి యవ్వన దశ పూర్తి అయిన తర్వాత జీవితం మారిపోతుంది. ఈ సమయంలో ఉద్యోగం, కుటుంబం బాధ్యతలు ఉంటాయి. రెండిటిని బ్యాలెన్స్ చేయడం ద్వారా జీవితం హాయిగా ఉంటుంది. అయితే కొందరు వీటిలో ఏదో ఒకదానిని మాత్రమే సక్సెస్ చేయగలుగుతారు. రెండో దాని గురించి తీవ్ర కష్టపడుతూ ఉంటారు. అలాంటి కష్టాలు ఉండకూడదు అంటే ఫ్రీ ప్లాన్ కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా 25 ఏళ్లు దాటిన తర్వాత 30 ఏళ్లలోపు యువత కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటే జీవితం హాయిగా ఉంటుంది. ఆ ప్రణాళికలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
50 30 20 రూల్స్:
కొత్త ఉద్యోగం రాగానే యువత చాలామంది వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా వచ్చిన ఆదాయాన్ని ప్రణాళిక బద్ధంగా ఉపయోగిస్తే సౌకర్యంగా ఉంటుంది. వచ్చిన ఆదాయంలో 50% ఇంటి ఖర్చులకు ఉపయోగించాలి. అంటే రెంట్, కిచెన్ అవసరాలు తదితరాలు. 30% పెట్రోల్, సొంత ఖర్చులు.. 20% పొదుపు లేదా అప్పు కట్టడం వంటివి ఏర్పాటు చేసుకోవాలి. అయితే రోజుల పెరుగుతున్నకొద్దీ ఖర్చులు తగ్గిస్తూ పొదుపు పెంచుకోవాలి. కొందరు డబ్బును ఇలా పొదుపు చేసి అలా తీసేసుకుంటారు. అయితే రిటైర్మెంట్ కోసం చేసే పొదుపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. వీటిని రిటైర్మెంట్ అయిన తర్వాత మాత్రమే ఉపయోగించుకోవాలి. అప్పుడు కూడా ఏడాదికి నాలుగు శాతం విత్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ ఖర్చులు తక్కువగా ఉంటే మరింత తక్కువగా విత్ డ్రా చేసుకోవడం మంచిది. అవసరానికి మించి విత్ డ్రా చేస్తే అత్యవసరానికి డబ్బు ఉండదు.
అత్యవసర నిధి:
వచ్చిన ఆదాయంలో 20% పొదుపు లేదా అప్పులకు ఉపయోగించాలని చెప్పాము కదా. వీటిలో కొంతవరకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒకవేళ ఉద్యోగం పోతే మూడు నెలల పాటు జీవించడానికి.. ఆస్పత్రుల ఖర్చులకోసం ఇతర ఎమర్జెన్సీ అవసరాలకు ఫండ్ పక్కన పెట్టుకుంటే నిత్యవసర ఖర్చులపై ఎలాంటి ప్రభావం ఉండదు. అంతేకాకుండా కొన్ని నెలల పాటు ఉద్యోగం లేకపోయినా ఒత్తిడి ఉండదు.
ఇంటి రెంట్:
కొందరు ఆదాయం ఎక్కువ రాగానే లగ్జరీ లైఫ్ ను మెయింటైన్ చేయాలని చూస్తారు. దీంతో అత్యధిక రెంటు వెచ్చించి జీవించాలనుకుంటారు. కానీ వచ్చే ఆదాయంలో మూడో వంతు మాత్రమే రెంట్ కు ఉపయోగించే విధంగా ఉండాలి. అంతకుమించి ఎక్కువగా ఉంటే ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ చెల్లించడం మంచిది. లేకుంటే నిత్యవసర ఖర్చులు లేదా ఇతర అవసరాలకు కష్టమవుతుంది.
ఈఎంఐ:
కారు లేదా ఇల్లు కొనాలని అనుకుంటే వాటిలో 20% డౌన్ పేమెంట్ చేయదలుచుకుంటేనే కొనుగోలు చేయాలి. 100% లోన్ ఎప్పుడు తీసుకోవద్దు. ఎందుకంటే పూర్తిగా అప్పు చేసి వస్తువులు కొనుగోలు చేస్తే వాటి వినియోగం పెరిగేకొద్దీ వడ్డీ పెరుగుతుంది. దీంతో ఎలాంటి లాభం ఉండదు. ప్రతినెలా లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయాలని అనుకుంటే.. వాటికి సరైన ఆదాయం వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. పొదుపు ద్వారా మాత్రమే లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయాలి.