OG vs Pushpa 2 Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ఓపెనింగ్స్ పరంగా వరల్డ్ వైడ్ గా సంచలనాలను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వర్త్ షేర్ పరంగా ఆల్ టైం రికార్డు ని నెలకొల్పిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. మిగిలిన పాన్ ఇండియన్ సినిమాలన్నీ ఐమాక్స్,డిబాక్స్ మరియు 4DX ఫార్మట్స్ లో విడుదలైతే ఓజీ చిత్రం మాత్రం కేవలం స్టాండర్డ్ ఫార్మట్స్ థియేటర్స్ లో విడుదల అవ్వడం, ఓవర్సీస్ కి కంటెంట్ డెలివరీ విషయం లో జాప్యం చేయడం తో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పలేకపోయింది. ఉదాహరణకు నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే 4 మిలియన్ డాలర్లకు రాబట్టేంత సత్తా ఉన్న చిత్రమిది. కానీ కంటెంట్ బాగా ఆలస్యంగా డెలివరీ అవ్వడం తో 3 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాల్లో కూడా కంటెంట్ డెలివరీ అవ్వకపోవడం వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ ని చాలా ఆలస్యంగా ప్రారంభించారు. ఫలితంగా చాలా గ్రాస్ నష్టపోవాల్సి వచ్చింది, అనేక షోస్ క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది. అందుకే ఈ చిత్రం ఓవర్సీస్ లో పుష్ప 2, #RRR రికార్డ్స్ ని అందుకోలేకపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రం ‘పుష్ప 2’ ని అందుకోవడంలో విఫలమైంది. అందుకు ముఖ్య కారణం ఈ చిత్రం ఫక్తు యాక్షన్ డ్రామా సినిమా అవ్వడం వల్లే. సినిమాలో కనీసం ఒక్క పాట అయినా పెట్టుంటే మాస్ సెంటర్స్ ఆడియన్స్ కి బాగా నచ్చేదని, అవి లేకపోవడం వల్ల గట్టి ఎఫెక్ట్ పడిందని, అందుకే అర్బన్ సెంటర్స్ లో వచ్చినంత గ్రాస్, క్రింద సెంటర్స్ లో రాలేదని అంటున్నారు విశ్లేషకులు. అయినప్పటికీ కూడా ‘హరి హర వీరమల్లు’ లాంటి ఫ్లాప్ తర్వాత ఈ రేంజ్ ఓపెనింగ్స్ ని రాబట్టడం అంత తేలికైన విషయం కాదు.
కేవలం పవన్ కళ్యాణ్ స్టామినా కారణంగానే ఇది సాధ్యమైందని అంటున్నారు. రేపటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలకు సెలవులు మొదలు కానున్నాయి. దసరా ముగిసేవరకు మంచి వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీకెండ్ కి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, క్లోజింగ్ కి 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కచ్చితంగా ఈ చిత్రం రాబడుతుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందా లేదా అనేది సోమవారం వచ్చే వసూళ్ళని బట్టి చెప్పొచ్చు. అయితే తెలంగాణ ప్రాంతం లో అకాల వర్షాలు ఈ సినిమా పై కాస్త ప్రభావం చూపుతున్నాయి. నిన్న అత్యధిక ప్రాంతాల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది.