Tejas Mk-1A deal: ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నయ్. ముఖ్యంగా స్వీయ సమృద్ధి విషయంలో భారత ప్రభుత్వం ఏమాత్రం రాజీపడడం లేదు. పైగా సరికొత్త మార్పులను.. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ రంగానికి అనుసంధానిస్తోంది. గతంలో ఎన్నడు లేనివిధంగా ఆయుధాలను.. మిసైల్స్ ను తయారు చేస్తోంది. ఇతర దేశాల మీద ఆధారపడే తీరును పూర్తిగా తగ్గిస్తోంది.
గతంలో మన దేశ రక్షణ రంగంలో తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ మిగ్ 21 ఉండేది. అయితే దీనికి మన దేశ వాయు దళం వీడ్కోలు పలికింది. దీని స్థానంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ ఫైటర్ జెట్ ను ప్రవేశపెట్టింది. గతంలోని దీనిని ప్రవేశపెట్టినప్పటికీ.. మరింత వేగంగా తేజస్ జెట్ సేవలను వినియోగించుకునేందుకు మన దేశ వాయు దళం ప్రణాళికలు రూపొందించింది. తేజస్ ఫైటర్ జెట్స్ ను క్రమంగా మిగ్ స్థానాలను భర్తీ చేయడానికి మన దేశ వాయు దళం అడుగులు వేసింది. తేజస్ ఫైటర్ జెట్ లు పలు స్క్వాడ్రన్ లలో సేవలు అందిస్తున్నాయి. ఇక వచ్చే నెలలో తేజస్ లోని అడ్వాన్స్ వెర్షన్ “ఎంకే వన్ ఏ” ను విడుదల చేయనుంది. ఎయిర్ టు ఎయిర్.. ఎయిర్ టు సర్ఫేస్ వంటి మల్టీ మిషన్ క్యాపబిలిటీస్ తేజస్ సొంతం.
ఇటీవల కాలంలో భారతదేశానికి శత్రు దేశాల ముప్పు పెరిగిపోయిన నేపథ్యంలో ఇటువంటి ఫైటర్ జెట్ ల అవసరం పెరిగిపోయిందని రక్షణ శాఖ భావించింది. అందువల్లే ఇన్ని రకాలుగా ప్రయోగాలు చేసి సరికొత్త మిస్సైల్స్, ఆయుధాలు, జెట్స్ తయారు చేస్తోంది. ఇవన్నీ కూడా కదనరంగంలో భారత ఆర్మీకి వెన్ను దన్నుగా నిలుస్తాయని రక్షణశాఖ భావిస్తుంది. ఇటీవల కాలంలో ఆపరేషన్ సిందూర్ , ఇతర ఆపరేషన్ జరిగినప్పుడు భారత ఆర్మీకి రఫెల్, ఇతర మిస్సైల్స్ సహకరించాయి. ఒకవేళ అంతకంటే ఎక్కువ పరిణామాలు మన దేశం ఎదుర్కొన్నప్పుడు తేజస్ అన్ని విధాలుగా సహాయపడుతుందని రక్షణ శాఖ భావిస్తోంది.