Suzuki Access 125: ద్విచక్రవాహనాల్లో కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తే వెంటనే దానిని సొంతం చేసుకోవాలనుకుంటారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఒకేసారి పేమేంట్ చేయడం కష్టంగా ఉంటుంది. వారి కోసం కొద్దిపాటి డాక్యుమెంట్లతో బైక్ లను ఫైనాన్స్ రూపంలో విక్రయిస్తూ ఉంటారు. అయితే డౌన్ పేమెంట్ చేయనిదే వాహనాన్ని వినియోగదారుడి చేతికి ఇవ్వరు. ఇది కొన్ని వాహనాలకు ఎక్కువగానే ఉంటుంది. ఈ మధ్య స్కూటర్లకు కూడా డిమాండ్ పెరుగుతుండడంతో వాటి డౌన్ పేమెంట్ పెరిగింది. సుజుకీ కంపెనీ మాత్రం తక్కువ డౌన్ పేమేంట్ సదుపాయాన్ని కల్పిస్తూ ఓ మోడల్ ను విక్రయిస్తుంది. ఈ స్కూటర్ ఫీచర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండడంతో దానిని సొంతం చేసుకునేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. దాని వివరాలేంటో తెలుసుకుందామా.
సుజుకీ కంపెనీ నుంచి స్కూటర్స్ నుంచి స్పోర్ట్స్ రేంజ్ లో వచ్చాయి. లేటేస్టుగా ‘యాక్సెస్ 125’ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉండడం ఆసక్తిని రేపుతోంది. 4 స్ట్రోక్, 1 సిలిండర్, ఎయిర్ కూల్ అయ్యే విధంగా దీని ఇంజిన్ ను అమర్చారు. ఇది 8.7 పీఎస్, 10 ఎన్ఎం టార్క్ పవర్ ను ఉత్పత్తి చేస్తోంది. ఫ్యూయల్ కెపాసిటీ 5 లీటర్లు, 52.5 బోర్, 57.4 ఎన్ఎం స్ట్రోక్ ను కలిగి ఉంది. ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ ను కలిగి ఉండడంతో దీనిని కంట్రోల్ చేసుకోవచ్చని విక్రయదారులు చెబుతున్నారు.
సుజుకీ యాక్సెస్ 125 షోరూం ధర రూ.79,400 ఉండగా ఆన్ రోడ్ ప్రైస్ 94,976 అవుతుంది. ఫైనాన్స్ ద్వారా తీసుకోవాలనుకుంటే అదనంగా పడుతుంది. అయితే దీనిని కేవలం రూ.10,000 డౌన్ పేమెంట్ తో సొంతం చేసుకోవచ్చని షో రూం నిర్వాహకులు చెబుతున్నారు. 9.7 శాతం వడ్డీతో రూ. 84,893 వరకు రుణం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా రూ.2,762 తో ఈఎంఐ స్ట్రాట్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇలా 3 సంవత్సరాలు పేమెంట్ చేస్తే ఈజీగా ఉంటుంది.
ఒకేసారి పేమెంట్ చేస్తే ఇబ్బంది అనుకునేవారికి ఈ స్కూటర్ మంచి ఆప్షన్ అని చెబుతున్నారు. ఇటీవల బైక్ లకంటే స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సుజుకీ యాక్సెస్ మంచి వెహికిల్ అని అంటున్నారు.ఇక వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో స్కూటర్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ కంపెనీలు తక్కుడ డౌన్ పేమేంట్ కు ఒప్పుకోవడం లేదు. సుజుకీ యాక్సెస్ ను మాత్రం రూ.10 వేలకు సొంతం చేసుకోవచ్చు.