https://oktelugu.com/

Kushboo- Venkatesh: స్టార్ హీరో వెంకటేష్ తో ఆ రిలేషన్ ఉంది.. బాంబు పేల్చిన ఖుష్బూ

వెంకటేశ్, కుష్బూలు కలిసి మొదటి సారి ‘కలియుగ పాండవులు’ సినిమాలో కనిపించారు. ఇది విక్టరీకి డెబ్యూ మూవీనే. 1986లో వెంకటేష్ తండ్రి డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు తీశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 5, 2023 / 10:46 AM IST
    Follow us on

    Kushboo- Venkatesh: ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన వారిలో కొంతమంది ఇప్పుడు సైడ్ పాత్రల్లో కనిపిస్తున్నారు. వీరు నటించేది సహాయ పాత్రలైనా గుర్తింపు ఉండే విధంగా స్టోరీని సెట్ చేస్తున్నారు డైరెక్టర్స్. అలా కొంతమంది అప్పుడు, ఇప్పుడు ఫేమస్ గా మారుతున్నారు. ఇటీవల కాలంలో నటి కుష్బూ గురించి చర్చ ఎక్కువైంది. మొన్నటి వరకు లావుగా కనిపించిన ఈ సీనియర్ నటి ఇప్పుడు ఊహించని రీతిలో స్లిమ్ గా మారారు. అంతేకాకుండా ఆమె పలు సినిమాల్లో వరుసగా నటిస్తుండడంతో ఆమె పర్సనల్ విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు, హీరో వెంకటేష్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఖుష్బూ కుండబద్దలయ్యే సంచలన వ్యాఖ్యలు చెప్పారు.

    వెంకటేశ్, కుష్బూలు కలిసి మొదటి సారి ‘కలియుగ పాండవులు’ సినిమాలో కనిపించారు. ఇది విక్టరీకి డెబ్యూ మూవీనే. 1986లో వెంకటేష్ తండ్రి డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు తీశారు. ఇందులో వెంకటేష్ విజయ్ గా, ఖుష్బ భారతీ పాత్రల్లో నటించారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతాన్ని అందించారు.

    మొదటి సినిమానే సక్సెస్ తరువాత అటు వెంకటేష్, ఇటు కుష్బూకు ఆ తరువాత అవకాశాలు పెరిగాయి. ఇద్దరూ స్టార్ హీరోలుగా మారారు. ఈ సినిమా తరువాత కుష్బూ కెప్టెన్ నాగార్జున, త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు, కిరాయి దాదా, మారణ హోమం, పేకాట పాపారావు చిత్రాల్లో నటించింది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన ఆమె అక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కొన్నిరోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నఆమె ‘స్టాలిన్’ మూవీ నుంచి తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.

    ఇలా పలువురు హీరోలతో నటించిన కుష్బూ రియల్ లైఫ్ లోనూ ఇతర నటుల ఫంక్షన్లకూ హాజరవుతూ ఉంటారు. అలాగే ప్రతీ సంవత్సరం గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తే కచ్చితంగా హాజరవుతారు. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం హీరోలందరూ మీట అవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒకప్పుడు కుష్బూతో సమానమైన తెలుగు స్టార్ హీరోయిన్లు, హీరోలు అందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారట. వీరు రోజు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్నీ మెసేజ్ లు పెట్టుకుంటారట.

    అయితే ఇందులో వెంకటేష్ ఉన్నా.. ఒక్క మెసేజ్ కూడా పెట్టరట. తనకున్న బిజీ లైఫ్ లో అసలు వాట్సాప్ గురించి తక్కువ ఆలోచిస్తారట. ఈ సందర్భంగా కుష్బూ వెంకటేష్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. మిగతా హీరోలకంటే వెంకటేష్ ప్రత్యేకం అని అన్నారు. ‘నేనూ వెంకీ ప్రతీరోజూ మాట్లాడుకోం. కానీ నాకు ఏదైనా సమస్య వస్తే మాత్రం వెంకీ వెంటనే రియాక్టవుతాడు. వెంకటేష్, నేను కలిసి మెంటల్ పార్ట్స్ నర్స్ . మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి.’ అని కుష్బూ వెంకీ గురించి చెప్పారు.